BigTV English

CM Chandrababu Warning: సరిపోతుందా శనివారం, తేడా వస్తే మక్కెలిరగ దీస్తా..

CM Chandrababu Warning: సరిపోతుందా శనివారం, తేడా వస్తే మక్కెలిరగ దీస్తా..

CM Chandrababu Warning: ఏపీలో వైసీపీ అలజడి క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తుందా? సీఎం చంద్రబాబు ఎందుకు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు? లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే మక్కెలు ఇరగిదీస్తామని ఎందుకన్నారు? క్రిమినల్ చరిత్రతో వస్తే.. ప్రభుత్వం పవర్ ఏంటో చూపిస్తానని ఎందుకన్నారు? తిరుమల టూర్ పేరిట వైసీపీ ఏమైనా స్కెచ్ వేసిందా? ప్రభుత్వానికి ఏమైనా సంకేతాలున్నాయా? ఇవే ప్రశ్నలు తెలుగు ప్రజలను వెంటాడుతున్నాయి.


తిరుమల లడ్డూ వ్యవహారం నుంచి తప్పుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. అధికార పార్టీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ‘దేవాలయంలో పూజలు చేద్దాం’ అనే కార్యక్రమానికి పిలుపు నిచ్చారు మాజీ సీఎం జగన్.

సీఎం చంద్రబాబు పాపాల్ని ప్రక్షాళన చేసేం దుకు పూజలు నిర్వహిస్తున్నామన్నది వైసీపీ వెర్షన్. నార్మల్‌గా జగన్ ఆలోచన వెనుక కారణాలు చాలానే ఉన్నాయట. సాధారణంగా హిందూ భక్తులు శనివారం, సోమవారం కచ్చితంగా దేవాలయాలకు వెళ్తారు.


శనివారం కలియుగ వైకుంఠ శ్రీనివాసుడికి, సోమవారం శివుడిని పూజలు చేస్తారు. ఈ విషయంలో భక్తులు తమకు దగ్గరగా ఉన్న దేవాలయాలకు వెళ్లడం చూస్తుం టాము. భక్తులు చేసే కార్యక్రమాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ స్కెచ్ వేసినట్టు అధికార పార్టీ నుంచి కౌంటర్లు పడిపో తున్నాయి. శనివారం కాకుండా మరో రోజు వైసీపీ ఈ తరహా కార్యక్రమం చేస్తే అట్టర్ ప్లాప్ అవుతుందని అంటున్నారు.

ALSO READ: వైసీపీ పాపప్రక్షాళన? తిరుమలకు జగన్, అన్ని ఆలయాల్లో పూజలు చేయాలంటూ పిలుపు!

చంద్రబాబు సర్కార్ విషయానికి వద్దాం. శనివారం తిరుమలలో అలజడి సృష్టించేందుకు వైసీపీ ఏమైనా స్కెచ్ వేసిందా? అనే డౌట్ అధికార పార్టీని అప్పుడే కలవరపెడుతోంది. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు కాస్త ఘాటుగా వ్యాఖ్యానించారని అంటున్నారు.

లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలని మక్కెలు ఇరగదీస్తామని సీఎం చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానించడం చూస్తుంటే, అంతర్గతంగా ప్రభుత్వానికి ఇన్‌పుట్ వచ్చి ఉండాలని అంటున్నారు. బోట్లతో బ్యారేజ్‌ని ఢీ కొట్టడం, దేవుడి రథం తగలబెట్టడం చూస్తుంటే వైసీపీ భారీ స్కెచ్ వేసిందనే అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి.

క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే, ప్రభుత్వం పవర్ ఏంటో చూపిస్తా సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. వైసీపీ ఏదో కుట్రకు ప్లాన్ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

‘దేవాలయంలో పూజలు చేద్దాం’ అనే కార్యక్రమానికి వైసీపీ పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఏకంగా 16 మంది ఐపీఎస్ బదిలీ వెనుక ఏదో జరుగుతుందనే చర్చ ఏపీ, తెలంగాణలో మొదలైపోయింది. దీనిపై ఇంకెన్ని వార్తలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

మరోవైపు శనివారం మాజీ సీఎం జగన్ తిరుపతికు వెళ్తున్నారు. దీనిపై అప్పుడే కూటమి నేతలు రియాక్ట్ అయ్యారు. జగన్ కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు. తిరుమలకు అన్యమతస్తులు ఎవరొచ్చినా డిక్లరేషన్ ఇస్తున్నారని, జగన్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నాయి.

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×