E-Paper
Advertisement

Varalaxmi Sarathkumar: లాస్ట్ 5 ఇయర్స్‌గానే సక్సెస్ చూశా.. అంతకుముందు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశా!

Varalaxmi Sarathkumar: లాస్ట్ 5 ఇయర్స్‌గానే సక్సెస్ చూశా.. అంతకుముందు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశా!
Advertisement

Varalaxmi Sarathkumar: లైఫ్ నేర్పిన పాఠాన్ని త్వరగా అలవరచుకున్నానని అన్నారు నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar). సక్సెస్, ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా సినిమా హిట్టయినా, ఫెయిలైనా రియాక్షన్ ఒకేలా ఉంటుందని తెలిపారు. తను దర్శకత్వం వహించిన ‘సరస్వతి’ (Saraswathi) చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు. లైఫ్‌లో ఒక చోట నిలబడకుండా వెళుతూనే ఉండాలని, డిప్రెషన్ అని బాధపడుతున్న వారికి ఆమె హితబోధ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

Also Read- Varalaxmi Sarathkumar: వరలక్ష్మిలోని ఈ యాంగిల్ తెలుసా? విజయ్ పాలిటిక్స్‌పై ఒక్కటే మాట!

రెండింటిని ఒకేలా చూడటం నేర్చుకున్నా

Advertisement

‘‘నేను నా కెరీర్‌ని 2009లో ప్రారంభించాను.. ఇప్పుడు 2025 అయిపోయింది. లాస్ట్ 5 ఇయర్స్‌గా మాత్రమే నేను అందరికీ తెలిశాను, సక్సెస్ చూశాను. అంతకు ముందు అంతా పోరాటమే చేస్తూ వచ్చాను. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. కొన్ని అవకాశాలు వస్తాయి, కొన్ని వచ్చినట్టే వచ్చి పోతాయి. కొందరు ఇన్ఫ్లూయెన్స్ ఉపయోగించి రోల్స్ లాగేసుకుంటారు. ఇలాంటివి చాలా చూశాను. అవన్నీ ఒక పార్ట్ అనుకోవడమే. అందుకే చాలా తొందరగా ఒక లెసన్ నేర్చుకున్నాను. ఫెయిల్యూర్ వచ్చినా, సక్సెస్ వచ్చినా.. రెండింటిని ఒకేలా చూడటం నేర్చుకున్నా. ఆ రెండింటికి ఒకటే రియాక్షన్. ఇది నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే, నేను ఒక షూటింగ్ స్పాట్‌కి వెళుతున్నాను. నా వరకు 100 శాతం ఎఫర్ట్ పెడుతున్నాను. డబ్బింగ్ చేస్తున్నాను.. ప్రమోషన్స్ చేస్తున్నాను.. బయటికి వచ్చేస్తున్నాను.

Also Read- Big TV Kissik Talks: 70 ఏళ్ల వాళ్లకి ఎందుకు పాలిటిక్స్?.. నేను రాజకీయాల్లోకి వస్తా!- వరు

ఒక్కసారి బయటకు వెళ్లి చూడండి

Advertisement

నేను చేసిన సినిమా హిట్టయినా, ఫ్లాపయినా సూపరే. ఎందుకంటే, నేనేం చేయాలి. అందులో నాదేం తప్పుంది. కాబట్టి మన చేతుల్లో ఏం లేదు. మన చేతుల్లో లేని విషయం గురించి ఎందుకు ఫీలవ్వాలి? ‘హనుమాన్’, ‘వీరసింహారెడ్డి’ పెద్ద సక్సెస్ అని చెప్పారు. హ్యాపీనే. మరుసటి రోజే నేను షూటింగ్‌కి వెళ్లిపోయాను. లైఫ్ అనేది ఒకే చోట నిలబడకూడదు.. వెళ్లిపోతూ ఉండాలి. అంతేకానీ, నావల్లే అని ఫీలయితే మాత్రం లైఫ్ అయిపోయినట్లే. అలా అయిపోయి డిప్రెషన్‌లోకి వెళ్లే వారికి నేను చెప్పేది ఏంటంటే.. ఒక్కసారి బయటకు వెళ్లి చూడండి. నీకు ఒక ఇల్లు ఉంది, భోజనం ఉంది, బెడ్ ఉంది.. అదే సక్సెస్ అంటే. రోడ్డు మీదకి వెళ్లి చూస్తే, ఎలాంటి వారు జీవిస్తున్నారో తెలుస్తుంది? వాళ్లే జీవిస్తున్నప్పుడు మనమెందుకు జీవించకూడదు. అందుకే సూసైడ్ థాట్స్ అవసరం లేదు. జీవించడం నేర్చుకోవాలి..’’ అని వరలక్ష్మి చెప్పుకొచ్చారు.

Also Read- Kissik Talks: ఆ థాట్ ప్రాసెస్ వస్తేనే మార్పు.. లేదంటే దమ్ములేనట్టే!.. సోషల్ మీడియాపై వరలక్ష్మి

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×