BigTV English

Sharmila Meeting with CPI, CPM: అరాచకాలను అడ్డుకునేందుకు కలిసి పని చేస్తాం.. పొత్తులపై షర్మిల క్లారిటీ!

Sharmila Meeting with CPI, CPM: అరాచకాలను అడ్డుకునేందుకు కలిసి పని చేస్తాం.. పొత్తులపై షర్మిల క్లారిటీ!

Sharmila Meeting With CPI,CPM Leaders: ఏపిసిపి అధ్యక్షురాలు వైఎస్. షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఎన్నికల హీట్‌ను పెంచుతోంది. ఈ క్రమంలో షర్మిల సిపిఐ, సిపిఎం నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. సీపీఎం నేతలు సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు, గఫూర్, వైవీ రావు అలాగే సిపీఐ నేతలు రామకృష్ణ, జల్లి విల్సన్, ముప్పాళ్ల నాగేశ్వరరావులు కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు.


ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే సీట్లపై, మేనిఫెస్టోపై వామపక్ష నేతలతో షర్మిల చర్చలు జరిపినట్లు సమాచారం. 20 సంవత్సరాల‌ తరువాత కాంగ్రెస్‌తో వామపక్షాలు పొత్తుకు సిద్ధమయ్యాయి. ఫిభ్రవరి 26న అనంతపురంలో జరిగే ఖర్గే సభకు ఆమెను ఆహ్వానించినట్లు తెలుసోంది.

ప్రజల సమస్యపై పోరాడేందుకు.. అధికార పార్టీ అరాచకాలను అడ్డుకునేందుకు కలిసి నడుస్తాము అని తెలిపింది. వైఎస్‌ఆర్‌, బీజేపీ కలిసి ప్రత్యేక హోదాను పట్టించుకోలేదన్నారు. తిరుపతి సాక్షిగా ఇస్తామన్నా ప్రత్యేక హోదా ఇప్పుడు ఎమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే ప్రత్యేక హోదా తప్పసరిగా వచ్చేది అని అన్నారు.


Read More: టీడీపీ, జనసేన మరో కీలక హామీ.. చర్చించిన నేతలు..

చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు.. కాని అది లేదు. జగన్ ఎన్నికల్లో బీజేపీతో కలిశారు. మరి రాష్ర్టనికి బీజేపి మెడలు వంచి ఈ ఐదేళ్లల్లో ఎం సాధించారని మండిపడ్డారు. కనీసం ప్రత్యేక హోదా కోసం ఏ ఒక్క ఎంపీ రాజీనామా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు.

పోలవరం విషయంలో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్‌కే ఎలాంటి వాడో నాకు తెలుసు.. ఎన్నో ఒత్తల్లతో ఆయన పార్టీ మారారు అని తెలిపారు. ఏపీను బీజేపీ, టీడీపీ, వైఎస్‌ఆర్‌ ఇలా అన్ని పార్టీలు మోసం చేశారు.. ఏపీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలి అన్నారు. ఈ అభివృద్ధి కోసం సీపీఎం, సీపీఐ నేతల మద్దతు కోరినట్లు తెలిపారు.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×