Big Stories

Twitter BlueTick subscription:ఇక భారత్‌లో బాదుడు షురూ..

Twitter BlueTick subscription

BlueTick subscription charge in India at Rs.900

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో యూజర్ల నుంచి బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు వసూలు చేస్తున్న ట్విట్టర్… ఇప్పుడు ఇండియాలోనూ ఆ అదనపు సేవలకు చార్జీలను ప్రకటించింది. విదేశాల్లో ఆండ్రాయిడ్ వినియోగదారుల నుంచి నెలకు 8 డాలర్లు… ఐఓఎస్ వినియోగదారుల నుంచి నెలకు 11 డాలర్లు వసూలు చేస్తున్న ట్విట్టర్… ఇండియాలో బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ కోసం నెలకూ రూ.900 చెల్లించాలని ప్రకటించింది. ఆండ్రాయిడ్ యూజర్లు అయినా, ఐఓఎస్ యూజర్లు అయినా… ఒకే రేటు ఫిక్స్ చేసింది. అయితే, డాలర్లతో పోల్చితే రూపాయల్లో ఎక్కువ వసూలు చేయాలనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం డాలరుతో రూపాయి మారకం విలువ 82 రూపాయలకు పైగా ఉంది. ఆ లెక్కన చూస్తే నెలకు రూ.650కి అటూ ఇటుగా వసూలు చేయాలి. కానీ, ఏకంగా 40 శాతం ఎక్కువగా భారత్‌లో బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలు నిర్ణయించడంపై దేశీ యూజర్లు భగ్గుమంటున్నారు. ఇక వెబ్‌ సబ్‌స్క్రిప్షన్‌ కోసం నెలకు రూ.650 చెల్లించాలని ట్విట్టర్ ప్రకటించింది.
అంతేకాదు… వెబ్‌ యూజర్ల కోసం రూ.6,800లతో ప్రత్యేక వార్షిక ప్లాన్‌ను కూడా ప్రకటించింది.

- Advertisement -

ట్విట్టర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకుంటే ట్వీట్లను తొలగించడం, ఎడిట్‌ చేయడం వంటి అదనపు ఫీచర్లు ఉపయోగించుకోవచ్చు. అలాగే హై రిజల్యూషన్ ఉన్న లెంగ్తీ వీడియోలను పోస్ట్‌ చేసుకోవచ్చు. ప్రకటనలు కూడా భారీగా తగ్గిపోతాయి. అయితే బ్లూ టిక్‌ పొందాలంటే అప్లై చేసుకున్న తేదీకి కనీసం 90 రోజుల ముందు నుంచి ట్విట్టర్‌లో ఉండాలి. బ్లూ టిక్‌ సబ్‌స్క్రైబ్ చేసుకున్న తర్వాత… ప్రొఫైల్ ఫోటో, డిస్‌ప్లే నేమ్, యూజర్ నేమ్ మార్చడానికి వీలుండదు. అలా చేస్తే అకౌంట్ మళ్లీ ధృవీకరించే దాకా బ్లూ టిక్ వెరిఫికేషన్‌ మార్పు కోల్పోతారు. అలాగే ఎలాంటి మార్పులు చేయడానికి అనుమతించరు. ఒకవేళ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ రద్దు చేసుకోవాలనుకుంటే… బిల్లింగ్ సైకిల్ ముగియకముందే రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఆటో రెన్యూవల్‌ ఆప్షన్ ఇచ్చిన యూజర్లు… 24 గంటల ముందే రద్దు చేసుకోవాలి. లేకపోతే చెల్లించిన డబ్బు వెనక్కి రాదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News