E-Paper
Advertisement

Mahesh-Namratha: మహేష్‌బాబు-నమ్రత.. ముందు ప్రపోజ్ చేసింది ఎవరంటే?

Mahesh-Namratha: మహేష్‌బాబు-నమ్రత.. ముందు ప్రపోజ్ చేసింది ఎవరంటే?
Advertisement

Mahesh-Namratha: మహేష్‌బాబు-నమ్రత శిరోద్కర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి జోడికి ఎంతో మంది అభిమానులున్నారు. సోషల్ మీడియాలో కూడా వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. పెళ్లి తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ.. పిల్లలు, ఇంటి బాధ్యత, వ్యాపారాలను చూసుకుంటుంది.

అయితే 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారి వంశీ సినిమా షూటింగ్‌లో వీరిద్దరు కలుసుకున్నారు. న్యూజిలాండ్‌లో దాదాపు 25 రోజులు సినిమా షూటింగ్ జరిగిందట. ఆ సమయంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అదికాస్త ప్రేమగా మారిందట. ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టమున్నా ఆ సమయంలో చెప్పుకోలేదట. ఇక షూటింగ్ అయిపోయి ఇండియాకు తిరిగి రాగానే ముందుగా నమ్రత తన మనసులోని మాటను మషేష్‌కు చెప్పేసిందట. అయితే మహేష్‌కు ఆల్రెడీ నమ్రత అంటే ఇష్టం ఉండడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. అలా వారి ప్రేమాయణం మొదలైంది.

Advertisement

2005లో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇరువురి ఇంట్లో చెప్పగా.. వారి ప్రేమను మహేష్ కుటుంబం మొదట అంగీకరించలేదట. ఆ సమయంలో మహేష్ సోదరి మంజుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పడంతో చివరికి ఒప్పకున్నారట. అలా 2005 ఫిబ్రవరి 10న మహేష్-నమ్రత వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హిందూ సంప్రదాయం ప్రకారం వారి పెళ్లి చాలా సింపుల్‌గా జరిగిందట. ఇక వారి వివాహం జరిగి నేటితో 18 ఏళ్లు పూర్తి కావడంతో ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×