E-Paper
Advertisement

Debt Position 2023 : అప్పు .. నిప్పు

Debt Position 2023 : అప్పు .. నిప్పు
Advertisement
debt position 2023

Debt Position 2023 : అప్పు నిప్పులాంటిది. అయినా అప్పులు చేస్తూనే ఉంటారు. మనమే కాదు.. ప్రపంచంలో అన్ని ప్రభుత్వాలు రుణాల వేట సాగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు చేసిన అప్పు 97.1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. 2019 నాటితో పోలిస్తే ఇది 40% పెరుగుదల.

కొవిడ్ సమయంలో జాబ్ మార్కెట్‌కు అండగా నిలవడానికి, దివాలా ఊబిలోకి జారిపోకుండా చూసేందుకు ప్రభుత్వాలు భారీ ఎత్తున ఆర్థిక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అమెరికా ప్రభుత్వం 33.2 ట్రిలియన్ డాలర్ల రుణభారాన్ని మోస్తోంది. ప్రపంచం మొత్తం అప్పులో ఇది మూడోవంతు.

Advertisement

అగ్రరాజ్యం చేసే ఖర్చులో ఐదోవంతు ఈ అప్పులు తీర్చేందుకే సరిపోతుంది. 2028 నాటికి ఈ మొత్తం 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. చైనా చేసిన అప్పులూ అధికమే. ప్రపంచం మొత్తం అప్పుల్లో దాని వాటా 15.1%గా ఉంది. ఇది 14,691 బిలియన్ డాలర్లకు సమానం.

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన జపాన్‌లోనూ అప్పుల గోల ఎక్కువే. ఆ దేశం రుణాల మొత్తం 10,797 బిలియన్ డాలర్లకు చేరింది. బ్రిటన్ అప్పు 3,468 బిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ 3,353, ఇటలీ అప్పు 3141బిలియన్ డాలర్లుగా ఉంది.

Advertisement

ఇండియా ఇప్పటివరకు 3056 బిలియన్ డాలర్ల అప్పు చేసింది. జర్మనీ 2,919 బిలియన్ డాలర్లు, కెనడా 2,253, బ్రెజిల్ దేశం 1,878 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ఈజిప్టు ఆదాయంలో 40% అప్పులు తిరిగి చెల్లించడానికే సరిపోతోంది.

ఈజిప్టు తరహాలోనే పలు వర్ధమాన దేశాలు అప్పుల విషవలయంలో చిక్కి విలవిలలాడుతున్నాయి. లెబనాన్ 2020 నుంచి అప్పులను తిరిగి చెల్లించడమే లేదు. ఘనా కూడా అంతే. 2022 నుంచి ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×