BigTV English

Sukesh Chandrashekhar Letter : త్వరలోనే జైలుకి కేటీఆర్‌, కవిత.. సుఖేష్‌ లేఖ ..

Sukesh Chandrashekhar Letter :  త్వరలోనే జైలుకి కేటీఆర్‌, కవిత..  సుఖేష్‌ లేఖ ..
Sukesh Chandrashekhar Letter

Sukesh Chandrashekhar Letter(Telugu breaking news today) :

మనీలాండరింగ్‌ కేసులో మండోలిలో జైలు జీవితం అనుభవిస్తున్న సుఖేష్‌ చంద్రశేఖర్‌ మరో లేఖతో కలకలం రేపాడు. కేటీఆర్‌, కవితలను ఉద్దేశిస్తూ లేఖ రాసిన ఆయన లెటర్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు. మీకు కౌంట్‌డౌన్‌ మొదలైంది బ్రదర్.. త్వరలోనే జైలుకి వెళ్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే కవిత చట్టబద్దంగా విచారణ ఎదుర్కోవాలని కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు. న్యాయ స్థానాలు, సామాన్య జనం కంటే ఎవరు పెద్దవారు కాదని.. వారి నిర్ణయమే తుది నిర్ణయమన్నారు.


మీ అహంకారం అంతమవుతుందని కొన్ని నెలల క్రితం లేఖలో తెలిపాన్న సుఖేందర్.. మీ అబద్ధాలు, దురాశ, అవినీతి అంతా తెలుగు వారందరికీ అర్థమైందని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని విమర్శలు గుప్పించారు. తనను మోసగాడు అనడం వల్ల తనకేం కాదు కానీ.. మీకు మాత్రం అధికార పీఠం లేకుండా పోయిందని.. మీరు సత్యాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.. మీరు చేసిన అవినీతికి సమాధానం చెప్పండి అని లేఖలో పేర్కొన్నారు. అలాగే మీరు మీకు ఇష్టమైన దేశం అమెరికాకు వెళ్లిపోతారని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని తెలిపారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాల నాడు ట్విట్టర్‌లో కేటీఆర్‌ పెట్టిన అప్‌డేట్‌ చూశానన్న సుఖేష్‌.. తుపాకీ గురిపెట్టిన మీ ఫొటోను షేర్‌ చేడయం బట్టి మూర్ఖత్వం అర్థమవుతుందని.. తెలంగాణ ఎన్నికల్లో కేటీఆరే నిజమైన స్టార్ కిల్లర్ అంటూ లేఖలో ప్రస్తావించారు సుకేశ్ చంద్రశేఖర్. ఇక ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడం అభినందనీయమన్నారు.


.

.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×