Big Stories

Elon Musk : దిగొచ్చిన ఎలన్ మస్క్.. ఇండియాలో టెస్లా ప్లాంట్ పెడతామని ప్రకటన

- Advertisement -

Elon Musk : ఎట్టకేలకు టెస్లా ప్లాంట్ ఇండియాకు వస్తోంది. ఏడాది చివరి కల్లా ఇండియాలో మానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతున్నట్టు ఎలన్ మస్క్ అనౌన్స్ చేశారు. ఇన్నాళ్లు ఇండియన్ గవర్నమెంట్ సహకరించడం లేదంటూ మాట్లాడిన ఎలన్ మస్క్.. ఇండియానే బెదిరించేలా వ్యవహరించారు. ముందు చైనా మేడ్ టెస్లా కార్లను అమ్ముకుంటూ, సర్వీసెస్ అందిస్తామని, ఇండియాలో సిచ్యుయేషన్స్ అనుకూలంగా ఉంటే అప్పుడు ప్లాంట్ పెడతామని చెప్పుకొచ్చారు.

- Advertisement -

చైనాలో తయారుచేసిన టెస్లా కార్లను ఇండియాలో అమ్ముకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. కావాలంటే వంద శాతం ఇంపోర్ట్ డ్యూటీ కట్టి అమ్ముకోవచ్చని తేల్చి చెప్పింది. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించమని ఎలన్ మస్క్ చేసిన విజ్ఞప్తిని కూడా కేంద్రం పట్టించుకోలేదు. ఇండియాలో ప్లాంట్ పెట్టి టెస్లా కార్లను తయారుచేసి అమ్ముకోవడం తప్ప మరో ఛాన్సే ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో ఇండోనేషియాలో ప్లాంట్ పెడతామని ఓసారి, సౌత్ కొరియాలో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని మరోసారి లీకులు ఇచ్చారు ఎలన్ మస్క్. కట్ చేసి చూస్తే.. ఇండియాకు టెస్లా కంపెనీ ప్రతినిధులను పంపించారు.

ఇండియాలో టెస్లా కార్లకు ఫుల్ డిమాండ్ ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రపంచంలో ఏ దేశంలో అమ్ముడుపోనన్ని కార్లు ఇండియాలో సేల్ చేసే అవకాశం ఉంది. 2030కి 2 కోట్ల కార్లు అమ్మాలనేది ఎలన్ మస్క్ టార్గెట్. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇండియన్ మార్కెట్ చాలా ఇంపార్టెంట్. అందుకే, ఎలన్ మస్క్ దిగొచ్చారని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు చైనా నుంచి ప్లాంట్‌ను తీసేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అమెరికా-చైనా మధ్య ఉన్న వైరం, చైనా వ్యవహరిస్తున్న తీరు కారణంగా డ్రాగన్ కంట్రీ నుంచి కంపెనీలు బయటకు వచ్చేస్తున్నాయి. పైగా జమ్మూ కాశ్మీర్‌లో లిథియం రిజర్వ్స్ బయటపడ్డాయి. సో, భవిష్యత్తులో బ్యాటరీస్ గురించి చైనాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఉన్నట్టుండి ఇండియాలో ప్లాంట్ పెడతాననడానికి ఇది కూడా ఓ కారణం.

మొత్తానికి ఇండియాలో ఎక్కడ ప్లాంట్ పెట్టాలనేది ఈ ఏడాది చివరి నాటికి నిర్ణయం తీసుకుంటామి ప్రకటించారు ఎలన్ మస్క్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News