
Israel : ఐక్యరాజ్య సమితిలో గురువారం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారతదేశం ఓటువేసింది. పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ ఆక్రమణలను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితిలో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి భారత్ సహా 145 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. దీంతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.
పాలస్తానాలోని వెస్ట బ్యాంక్ ప్రాంతంలోని తూర్పు జెరూసలేం, ఆక్రమిత సిరియన్ గోలన్ భూభాగాల్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లు ఉన్నాయి. ఈ సెటిల్మెంట్లలో ఇజ్రాయెల్ పౌరులు తమ ప్రభుత్వ అండదండలతో స్థిరపడ్డారు. పైగా అక్కడ ఉంటున్న పాలస్తీనా పౌరులను బలవంతంగా ఖాళీచేయించారు. దీంతో ఆ ప్రాంతాలలో తరుచూ హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం పాలస్తీనా భూభాగంపై తన సెటిల్మెంట్లను అక్కడి నుంచి తొలగించాలని ఐక్యరాజ్యసమితి తీర్మాన ఉద్దేశ్యం.
అయితే ఈ తీర్మానాన్ని ఏడు దేశాలు వ్యతిరేకించాయి. కెనడా, హంగేరీ, ఇజ్రాయెల్, మార్షల్‌ఐలాండ్స్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, నౌరు, అమెరికా తీర్నానాన్ని వ్యతిరేకించిన దేశాలు కాగా.. మరో 18 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.
కొన్ని రోజుల క్రితం.. ఇజ్రాయెల్-హమాస్ యద్ధాన్ని తక్షణమే ఆపేయాలని కోరుతూ జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్దంలో 11,000 మందికి పైగా గాజా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో దాదాపు 4,506 చిన్నిపిల్లలు, 3,027 మంది మహిళలు, 678 మంది వృద్ధులు ఉన్నారని సమాచారం. మరోవైపు అక్బోబర్ 7న హమాస్ చేసిన దాడుల్లో దాదాపు 1400 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు.
Pawan Kalyan : శ్రవణ్ కు పవన్ సపోర్ట్.. బీజేపీని ఉడికిస్తున్న జనసేనాని!