Sourav Ganguly : నా బలవంతం మీదే రోహిత్ కెప్టెన్ అయ్యాడు.. వైరల్ అవుతున్న గంగూలీ మాటలు.

Sourav Ganguly : నా బలవంతం మీదే రోహిత్ కెప్టెన్ అయ్యాడు.. వైరల్ అవుతున్న గంగూలీ మాటలు.

Saurabh Ganguly
Share this post with your friends

Sourav Ganguly : భారత్ క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నిజానికి తను ఇండియన్ క్రికెట్ కి చేసిన మేలు సామాన్యమైనది కాదు. అంతవరకు సీనియర్ ఆటగాళ్ల అంతర్గత రాజకీయాలతో, సొంత రికార్డులకే ప్రాధాన్యమిస్తూ,  కుళ్లు కుతంత్రాలతో జట్టు ప్రయోజనాలను బ్రష్టుపట్టించిన దశ నుంచి ఇండియన్ క్రికెట్ ని బయటకు లాగిన ఏకైక వ్యక్తి సౌరభ్ గంగూలీ అనే చెప్పాలి.

క్రికెట్ ఆడేది నీ సొంతానికి, నా సొంతానికి కాదు.. దేశం కోసమనే భావన కలిగించాడు. కొత్తతరానికి అవకాశమిచ్చాడు. దేశంలోని వివిధ ప్రాంతాలకు సెలక్టర్లు వెళ్లి ప్రతిభావంతులను వెతికి పట్టుకున్నారు. అలా మహేంద్రసింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ లాంటి ఎన్నో ఆణిముత్యాలు భారత క్రికెట్ కి లభించాయి. వారికెన్నో అవకాశాలిచ్చి, తీర్చిదిద్దిన గురువు సౌరభ్ అనే చెప్పాలి.

అసలు ధోనీ మీద మొదటి నుంచి నమ్మకం ఉన్న ఏకైక వ్యక్తి సౌరభ్ గంగూలీయే. తన కెప్టెన్సీలోనే ధోనీ ఆరంగ్రేటం చేశాడు. అలా తర్వాత కాలంలో ధోనీ భారత క్రికెట్ ని శిఖరాగ్రానికి చేర్చాడు. అలా భారత క్రికెట్ కి నయా సొబగులు అద్డిన సౌరభ్ గంగూలీ తాజాగా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇద్దామంటే తను అంగీకరించలేదని తెలిపాడు. ఇప్పుడామాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నిజానికి కెప్టెన్సీ అనగానే అందరూ ఎగిరి గంతేస్తారు. కానీ తను వద్దన్నాడు. నేనే అతడ్ని ఒప్పించానని, ఎలాగైనా కెప్టెన్ గా ఆడాల్సిందేనని అన్నానని తెలిపాడు. రేపు దాని ఫలితం చూడబోతున్నామని అన్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో ఇండియా అప్రతిహితంగా రోహిత్ కెప్టెన్సీలో సాగిపోతోంది.

ఈనేపథ్యంలో సౌరభ్ మాట్లాడుతూ 2021 టీ 20 ప్రపంచకప్ తర్వాత కొహ్లీ  కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత వన్డే, టెస్టు కెప్టెన్సీకి  దూరమయ్యాడు. దీంతో బీసీసీఐకి దొరికిన మరో ఆప్షన్ రోహిత్ శర్మ మాత్రమే. అప్పటికే ముంబయి ఇండియన్స్ కి సారథ్యం వహించడం, అంతర్జాతీయ మ్యాచ్ లతో బిజీగా ఉండటంతో రోహిత్ ఇష్టపడలేదు. కానీ తనే అన్ని ఫార్మాట్లకి బెస్ట్ కెప్టెన్ అని భావించానని సౌరభ్ అన్నాడు.

కానీ ఎంత సేపు ఒత్తిడి చేసినా తన నుంచి ‘ఎస్’ అనే మాట రాకపోవవడంతో ఇక ఫైనల్ గా నేనే చెప్పా…
నువ్వు ఒప్పుకుంటావా? సరేసరే…లేదంటే.. నేనే ప్రకటించేస్తా అన్నాడు. దాదా సంగతి అందరికీ తెలిసిందే. నిజానికి ఒక వీధికో, ప్రాంతానికో, ఒక ఊరికో, ఒక సిటీకో ఒక దాదా ఉంటాడు. కానీ ఇండియన్ క్రికెట్ కి దాదా ఎవరంటే సౌరభ్ గంగూలీ అనే చెప్పాలి. తనొక్కసారి కమిట్ అయ్యాడంటే ఇంక ఎవ్వరి మాట వినడు. ఈ  సంగతి బాగా తెలిసిన రోహిత్ సరేనని ఒప్పుకున్నాడు. అయితే సౌరభ్ మాట్లాడుతూ రోహిత్ విజయవంతమైన కెప్టెన్ గా ఈ స్థాయికి వెళ్లడం నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. అతని ప్రతిభ ఏమిటో నాకు తెలుసు. నా నమ్మకాన్ని నిలబెట్టడం సంతోషంగా ఉందని అన్నాడు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Pakistan Cricket Team : ఉస్మాన్ ముందు మాటాడొద్దు రా బాబూ : పాక్ నిర్ణయం

Bigtv Digital

T20 World Cup 2024 : ఇదే .. టీ 20 వరల్డ్ కప్ ఫార్మాట్ ? ఏ గ్రూప్ లో ఎవరున్నారు?

Bigtv Digital

ICC World Cup 2023 : క్యాచ్ మిస్ అయితే.. మ్యాచ్ పోయినట్టే..

Bigtv Digital

Arjuna Awards: తెలుగు తేజాలకు అర్జున అవార్డులు

BigTv Desk

Rohit Sharma : రోహిత్ శర్మ స్పీడు మామూలుగా లేదుగా.. కారుపై 3 చలాన్లు, 200 kmph స్పీడ్..

Bigtv Digital

Prithvi Shaw: పృథ్వి షాపై వేధింపుల కేసులో నిజం లేదు..

Bigtv Digital

Leave a Comment