E-Paper
Advertisement

Semiconductor : చిప్ కంపెనీల్లో రారాజు టీఎస్ఎంసీ

Semiconductor : చిప్ కంపెనీల్లో రారాజు టీఎస్ఎంసీ
Advertisement
Semiconductor

Semiconductor : మొబైల్ ఫోన్ల నుంచి కార్లు, ప్లేన్లు, రిఫ్రిజిరేటర్ల వరకు అన్నింటికీ కావాల్సింది సెమీకండక్టర్ చిప్‌లే. ఆధునిక జీవనంతో ఇంతగా పెనవేసుకుపోయాయి ఇవి. ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ అంటేనే బిలియన్ డాలర్ల వ్యవహారం.

సెమీ కండక్టర్ చిప్ తయారీ పరిశ్రమల్లో రారాజు టీఎస్ఎంసీ. తైవాన్‌కు చెందిన తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్(TSMC) ఆదాయం ఎంతో ఊహించగలరా? మొత్తం చిప్ పరిశ్రమల ఆదాయంలో టీఎస్‌ఎంసీ వాటాయే 60%. ఇది 17 బిలియన్ డాలర్లకు సమానం.

Advertisement

2023 తొలి త్రైమాసికంలో(Q1) ఆ కంపెనీ 16,735 మిలియన్ డాలర్లు ఆర్జించింది. 3,446 మిలియన్ డాలర్ల ఆదాయంతో దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానం దక్కించుకున్న అమెరికా సంస్థ గ్లోబల్ ఫౌండ్రీస్ 1841 మిలియన్ డాలర్ల ఆదాయం పొందింది.

యూఎంసీ చిప్ కంపెనీ ఆదాయం 1784 మిలియన్ డాలర్లు ఉండగా.. ఎస్ఎంఐసీ 1462 మిలియన్ డాలర్లు, హ్యూహాంగ్ గ్రూప్ 845, టవర్ సెమీకండక్టర్ 356, పీఎస్ఎంసీ 332, వీఐఎస్ 269, డీబీ హితెక్ కంపెనీ 234 మిలియన్ డాలర్ల ఆదాయం పొందాయి. మిగిలిన సెమీకండక్టర్ కంపెనీలన్నింటి మొత్తం ఆదాయం 556 మిలియన్ డాలర్లుగా ఉంది.

Advertisement

ప్రపంచవ్యాప్తంగా అన్ని సెమీ కండక్టర్ కంపెనీల ఆదాయం Q1లో 27,860 మిలియన్ డాలర్లుగా ఉంది. టాప్‌టెన్‌ చిప్ కంపెనీల్లో 4 తైవాన్ దేశానికి చెందినవే. చైనా కంపెనీలు రెండు, దక్షిణ కొరియా రెండు, అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు చెందిన ఒక్కొక్క కంపెనీ ఆ జాబితాలో ఉన్నాయి.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×