E-Paper
Advertisement

The Archies : నేపో కిడ్స్ కు మాత్ర‌మే ప్రమోషనా? మండిపడుతున్న నెటిజన్స్..

The Archies : నేపో కిడ్స్ కు మాత్ర‌మే ప్రమోషనా? మండిపడుతున్న నెటిజన్స్..
Advertisement
The Archies

The Archies : జోయా అక్తర్ ‘ది ఆర్చీస్’ తో వెండితెర‌కు బాలీవుడ్ నట వారసులు పరిచయం కాబోతున్నారు. షారూఖ్ ముద్దుల కూతురు ..సుహానా ఖాన్, దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు..ఖుషీ కపూర్, అమితాబచ్చన్ మనవడు..అగస్త్య నందా ఈ మ్యూజికల్ డ్రామా తో తమ సినీ ప్రస్థానానికి అరంగేట్రం చేస్తున్నారు. వీరి తో పాటు గా మిహిర్ అహుజా, అదితి సైగల్, వేదంగ్ రైనా, యువరాజ్ మెండా తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు. డిసెంబర్ 7 నుండి ఓటీటీ దిగ్గజ ప్లాట్ఫారం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

ఈ మూవీలో పాత్రలు ఆసక్తి కలిగించే విధంగా ఉన్నాయి. కానీ సౌత్ ఆడియన్స్ కు ఇవి ఎంతవరకు నచ్చుతాయి అన్నది మాత్రం డౌటే. ప్రచార పరంగా బాగా క్రియేట్ చేస్తున్న ఈ సిరీస్ మన పక్క ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి.ఇటీవల ది ఆర్చీస్ నుంచి విడుదలైన కొత్త పోస్టర్ బజ్ బాగా క్రియేట్ చేసే విధంగా ఉంది. అయితే ఈ సరికొత్త పోస్టర్ మరో సరికొత్త వివాదానికి తెరలేపింది 

Advertisement

ఈ పోస్టర్లో ముగ్గురు నటవారసుల్ని మాత్రమే ఎలివేట్ చేయడంపై నేటిజెన్లు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేకర్స్ పై విరుచుకుపడ్డారు. ఇది నెపో పిల్లల్ని ప్రమోట్ చేసే పోస్టర్ గా ఉంది అని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఈ మూవీలో మొత్తం ఏడుగురు నటీనటులు ఉంటే కేవలం ముగ్గురిని హైలైట్ చేయడం పై వారు ప్రశ్నిస్తున్నారు.

రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ లో సుహానా ఖాన్ లైట్ నీలం రంగు దుస్తులు ధరించగా.. ఖుషి తెల్లని మల్లెపువ్వులా మెరిసిపోతోంది. వీరిద్దరి మధ్యలో అగస్య నంద కెమెరా వైపు చూస్తూ నవ్వుతున్నాడు. ఇక పోస్టర్లో ఈ ముగ్గురు ఒకే మిల్క్ షేక్ లో మూడు స్ట్రాస్ వేసుకొని తాగుతున్నారు. అంటే ఇది లవ్ ట్రయాంగిల్ అన్న విషయం పోస్టర్ ద్వారా ఇండికేషన్స్ ఇస్తున్నారు అని అర్థమవుతుంది.

Advertisement

ఇక ఈ వెబ్ సిరీస్ పోస్టర్ పై సోషల్ మీడియాలో పెద్ద దుమారం కొనసాగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో నెపో కాన్సెప్ట్ పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో ,హీరోయిన్లు కాక వాళ్ళ పిల్లలు, మనవాళ్ళకి కూడా నెపో టాగ్ తగిలించేస్తున్నారు.ఈ నెపో బాలీవుడ్ స్టార్స్ గా మార్చే దాకా వదిలిపెట్టరు…దానికోసం మిగిలిన వాళ్ళ టాలెంట్ ని తొక్కేస్తారు అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు. పోస్టర్లో మిగిలిన వాళ్ళని కూడా చూపించి ఉంటే అసలు ఈ సమస్య వచ్చేదే కాదు అని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×