Big Stories

Ys sharmila angry on Bharathi: భారతిపై షర్మిల ఆగ్రహం, గొడ్డలితో నరికేయండి.. పారిపోవడానికి పాస్‌పోర్టు..

Ys sharmila comments on Bharathi: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కడప రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు కడప ఎంపీగా ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. నామినేషన్ సమయంలో పులివెందుల వచ్చిన సీఎం జగన్, తన చెల్లి ధరించిన చీర గురించి నోరు విప్పి అడ్డంగా బుక్కయ్యారు. దీంతో వైసీపీ వేసిన ప్లాన్ బూమరాంగ్ అయ్యింది. ఇది కరెక్టు కాదని భావించిన వైసీపీ అధిష్టానం… భారతి, అవినాష్‌రెడ్డి భార్యను రంగంలోకి దించింది. దీంతో కడప రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

- Advertisement -

వైసీపీ తరపున పులివెందులతోపాటు మిగత నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు వైఎస్ భారతి. పరిస్థితి గమనించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రెండోసారి జిల్లా అంతటా పర్యటిస్తున్నారు. ఇందుకోసం కడప కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మకాం వేశారు. దీంతో వదిన-మరదలు మధ్య ప్రచారంలో తారాస్థాయికి చేరింది. ఇటీవల ప్రచారంలో భారతి చేసిన కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు వైఎస్ షర్మిల.

- Advertisement -

భారతి స్ట్రాటజీ ఇదేనా అంటూ ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్. గొడ్డలితో మిగతావాళ్లను నరికేయండి.. అప్పుడు మీరే సింగల్ ప్లేయర్‌గా ఉంటారని వ్యాఖ్యానించారు. మాకు పార్టీ ఉందని, కేడర్, బూత్ లెవల్ ఏజెంట్లు ఉన్నారన్న వ్యాఖ్యలపై ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యారు. అద్భుతాలు చేసేది దేవుడని, ఇలాంటి వారికి దేవుడు సహాయం చేయరన్నారామె.

వైఎస్ షర్మిల మరో బాంబు పేల్చారు. అవినాష్‌రెడ్డి విదేశాలకు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. ఓడితే అరెస్టు తప్పదనే భయంతోనే కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఊరు దాటి వెళ్లేందుకు పాస్‌పోర్టును సిద్ధం చేసుకున్నారన్నారు. ఈసారి కడప ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఎంపీని కలవడానికి వైఎస్సార్ బిడ్డకు ఓటు వేయాలని లేదంటే  జైలుకి వెళ్లి కలవాలంటే అవినాష్‌రెడ్డికి ఓటు వేయాలన్నారు.

మంగళవారం రాత్రి విశాఖ జిల్లా గాజవాక రోడ్ షోలో సీఎం జగన్ చేసిన కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కి గనులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సీఎంకు లేదా అని ప్రశ్నించారు. వైసీపీ గెలిస్తే ఈసారి స్టీల్‌ప్లాంట్ అమ్ముడు పోవడం ఖాయమన్నారు. 1000 రోజులకు పైగానే కార్మికులు ధర్నాలు చేస్తున్నారని, ఈ విషయం జగన్‌కు తెలీనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

ALSO READ: మోదీకి కౌంటరిచ్చిన జగన్, మరో కొత్త నాటకం?

వైఎస్సార్ 42 ప్రాజెక్టులను డ్రీమ్‌గా పెట్టుకున్నారని, వాటిని నవరత్నాల్లో పెట్టి ఏం చేశారని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్. మొత్తానికి వైఎస్ షర్మిల అటు కడప వైపు కాదు.. ఇటు జగన్ ప్రతీ రోజూ చేస్తున్న వ్యాఖ్యలపైనా కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. రానున్న రోజుల్లో మాటలయద్ధం తారాస్థాయికి చేరడం ఖాయమంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News