Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ కలకలం రేపుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు ఓ వ్యక్తి. దురంతో ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో చరణ్ అనే వ్యక్తి అనుమాన స్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని దగ్గర నుండి 36 LICT బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారి శైలిలో ప్రశ్నించగా.. ఈ డ్రగ్స్‌ను వశాఖకు చెందిన వైసీపీ స్టూడెంట్ వింగ్, విశాఖ అధ్యక్షుడు కొండారెడ్డి కోసం తీసుకొని వెళ్తున్నట్టు తెలిపాడు.దీంతో వెంటనే టాస్క ఫోర్స్ , ఈగల్ టీం కొండారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆయన్ను విచారణ చేస్తున్నట్టు సమాచారం.