Indian Woman: అమెరికాలో ఏ విధంగా అయితే రూల్స్ కఠిన తరంగా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే అనేక మంది భారతీయ యువత, యువకులు చదువు కోసం, ఉద్యోగం కోసం వెళ్తూ ఉన్న వాళ్లు.. ఏదో ఒక విషయంలో దొంగతనం చేస్తూ కొంత మంది దొరికిపోయి భారతీయుల పరువు తీస్తున్న ఘటనలో రోజు రోజుకి తెర పైకి వస్తున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అమెరికాలో ఒక స్టోర్ లో బట్టలు దొంగతనం చేస్తూ.. తనకి తన బ్రదర్‌కి కూడా ఇద్దరికీ కూడా మేడ్ ఇన్ యుఎస్ ప్రొడెక్ట్స్ దొంగలించింది. తను తీసుకువెళ్తూ బిల్లు చెల్లించకుండా అక్కడున్న యాజమాన్యానికి దొరికిపోయింది. దీంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. యువతి చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లారు. సుమారు 10 నిమిషాల పాటు ప్లీజ్ వదిలేయండి, డబ్బులు ఇచ్చేస్తానని మెురపెట్టుకుంది.