Sri Charani: మారుమూల గ్రామంలో పుట్టి ప్రపంచ క్రికెట్‌లో మెరిసింది కడప ఆణిముత్యం శ్రీ చరణి. తండ్రి నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.. ఆర్టిపిపలో చిన్న ఉద్యోగం చేసేవాడు. శ్రీ చరణి ఆటల్లో మెుదటి నుంచి చురుగ్గా ఉండగా.. క్రీడల్లో ఆమె ప్రతిభను గుర్తించారు. దీంతో ఆమెను స్కూల్ PET హైదరాబాద్‌లో కోచింగ్ ఇప్పిస్తే మంచి క్రీడాకారిణిగా రాణిస్తుందని ఊహించారు. కానీ శ్రీచరణి కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో వ్యతిరేకించింది. మేనమామ కిషోర్ కుమార్ రెడ్డి ప్రోత్సాహంతో.. హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతూ కోచింగ్ తీసుకుంది. క్రికెట్‌లో అతి తక్కువ కాలంలోనే ప్రపంచ క్రికెటర్ స్థాయికి ఎదిగింది. మహిళా వరల్డ్ కప్ ఫైనల్లో రాణించి క్రికెట్ అభిమానుల్లో సంచలనంగా మారింది. ప్రపంచ క్రికెట్‌లో మెుదటిసారి కడప నుంచి ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా కడపలో మహిళా క్రికెటర్లు సంబరాలు చేసుకుంటున్నారు.