Hyderabad: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ దోపిడికి గురైంది. గురువారం 3 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన డబ్బులను బ్రిలియంట్ కాలేజీ లాకర్ లో జమ చేశారు. అదే రోజు అర్ధరాత్రి దుండగులు కాలేజి సేఫ్ లాకర్స్‌ను బ్రేక్ చేసి రూ.కోటి దోచుకెళ్లారు. అంతే కాకుండా 200 కెమెరాలు ఉన్న డివిఆర్‌ను సైతం ఎత్తికెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. కాలేజీలో కోటి రూపాయలు ఉండటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.