Road Incident: వరంగల్- ఖమ్మం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖిల్లా వరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంప్ వద్ద యూ టర్న్ కోసం ఓ ఆటో, బైక్ ఆగి ఉన్నాయి. అటుగా వస్తున్న మరో ఆటో అతి వేగంతో యూ టర్న్ వద్ద ఉన్న వాహనాలను ఢీ కొట్టింది. దీంతో అవి ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పడ్డాయి. స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టి గాయపడినవారిని సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆటో డ్రైవర్లు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సమీపంలోని సీసీటీవీని పరిశీలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.