Crime News: భార్య అనారోగ్య సమస్యలు దాచిపెట్టి పెళ్లి చేశారని కోపంతో ఓ వైద్యుడు దారుణానికి ఒడిగట్టాడు. చికిత్స పేరుతో హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. పోలీసులు సమాచారం ప్రకారం.. కృతిక రెడ్డి డెర్మటాలజిస్ట్, మహేంద్ర రెడ్డి జనరల్ సర్జన్ వీరు బెంగుళూరులోని విక్టోరియా హాస్పిటల్‌లో పనిచేసేవారు. ఇద్దరు ఒకే హాస్పిటల్‌లో పనిచేయడంతో వారి తల్లిదండ్రులు వాళ్లకి వివాహం చేశారు. కృతికకు అనారోగ్య సమస్యలు ఉండటంతో.. తనకి ముందే చెప్పకపోవడంతో ఇద్దరి మద్య ఘర్షణ ఏర్పడింది. దీంతో కృతికరెడ్డిని చంపాలని నిర్ణయించుకొని.. ఆపరేషన్ థియేటర్లో వినియోగించే ప్రొపోఫోల్ అనే మత్తు మందును ఓవర్ డోస్ ఇచ్చి హత్య చేశాడు మహేంద్ర రెడ్డి. నిందితుడు కృతికరెడ్డిది సహజ మరణంగా తల్లిదండ్రులను నమ్మించాడు. బాధితురాలి అక్కకి అనుమానం రావడంతో.. వైద్య పరీక్షలు చేయించింది. ఆరు నెలల తర్వాత ఫారెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదికలో హత్యగా గుర్తించారు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా.. హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.