AP News: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలోని NGO కాలనీలో వింత ఘటన చోటుచేసుకుంది. పరాయి స్త్రీలతో సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో భర్తని కిడ్నాప్ చేయించింది ఓ భార్య. తల్లిదండ్రుల సమాచారం ప్రకారం.. తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మంజులాకు రైల్వే ఉద్యోగి ప్రవీణ్‌కు వివాహం జరిగింది. పెళ్లయిన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. వేరువేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం వల్ల మనస్పర్థలు పెరిగి ప్రవీణ్ పై మంజులాకు అనుమానం మెుదలైంది. ప్రవీణ్ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడన్న అనుమానంతో.. 15 మందితో కలిసి భర్తను, ఇంటిలో పనిచేసే పనిమనిషిని కిడ్నాప్ చేసింది. ఆపేందుకు ప్రయత్నించిన ప్రవీణ్ తల్లిదండ్రులపై దాడి చేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.