Jagan KTR: పాదయాత్ర.. రాజకీయ నాయకుడిని ప్రజలకు దగ్గర చేసే పాత రాజకీయ అస్త్రం. కానీ నడకతోనే ఓట్లు పడతాయా..? లేక ప్రజల సమస్యలను తన రాజకీయ అజెండాగా మార్చినప్పుడే యాత్రకు ఫలితం ఉంటుందా..? జగన్ గతంలో చేసిన ప్రజా సంకల్ప యాత్ర 341 రోజుల్లో 3,648 కిలోమీటర్లు సాగింది. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఆ యాత్ర వైసీపీ విజయానికి కీలక రాజకీయ వేదికగా మారింది. ఇప్పుడు 2027లో మరో సుదీర్ఘ పాదయాత్రకు జగన్ సిద్ధమవుతున్నారన్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. తండ్రి వైఎస్ జయంతి రోజునే ప్రారంభించి దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లో ఉండేలా రూట్‌మ్యాప్ రెడీ అవుతోందంటున్నారు.
ఇక తెలంగాణలో కేటీఆర్ కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. కేసీఆర్ బస్సుయాత్ర చేస్తారని, అదే సమయంలో తాను పాదయాత్ర చేస్తానంటున్నారు. అంటే.. అక్కడా ఇక్కడా ఇద్దరి టార్గెట్ ఒక్కటే. అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించి.. దాన్ని రాజకీయ ప్రత్యామ్నాయంగా మలచడం. అయితే యాత్రలో జనాలు రావడం ఒక ఎత్తు.. ఆ జనాన్ని ఓటర్లుగా మార్చడం మరో ఎత్తు. జగన్‌కు గతంలో పనిచేసిన ఫార్ములా ఈ కాలంలో పనిచేస్తుందా..? కేటీఆర్ పాదయాత్ర బీఆర్ఎస్‌ను తిరిగి అధికార రేసులోకి తీసుకురాగలదా..?