BRICS Summit: ఒకవైపు అమెరికా ఫస్ట్.. మరోవైపు గ్లోబల్ సౌత్ ఫస్ట్. ఈ రెండు ధోరణుల మధ్య ఢిల్లీ వేదికగా BRICS సమ్మిట్ జరుగుతోంది. BRICS ఇప్పుడు 11 దేశాలకు విస్తరించి, ప్రపంచ జనాభాలో 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తోంది. అమెరికా విధించే ఏకపక్ష టారిఫ్‌లు, ఆంక్షలపై BRICS ఆర్థిక నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో మోడీ-పుతిన్ చర్చల్లో పశ్చిమ దేశాలపై ఆధారపడని వాణిజ్యం, చెల్లింపుల వ్యవస్థల దిశగా అడుగులు పడుతున్నాయ్. అటు మోడీ బ్రిక్స్ కు ముందు Xలో పెట్టిన సంస్కృత శ్లోకం కూడా హాట్ టాపిక్ అయింది. అది ఎవరికి ఇండైరెక్ట్ వార్నింగ్ అన్న చర్చ నడుస్తోంది. నిజానికి భారత్ ఎవరి గ్రూప్ లో పూర్తిగా చేరకుండా, అవసరమైన ప్రతి దేశంతో మనకు బెనిఫిట్ అయ్యేలా సంబంధాలు కొనసాగిస్తోంది. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా BRICS దేశాలు స్థానిక కరెన్సీలు, CBDC చెల్లింపులపై చర్చిస్తున్నా, డాలర్‌ను పూర్తిగా పక్కనపెట్టే స్థాయికి ఇంకా రాలేదు. సో మరి బ్రిక్స్ రెండు రోజుల మీటింగ్ లో ఏం అవుట్ కమ్ వస్తుందో చూడాలి.