BigTV English

Bigg Boss Today Promo 2: ‘బొచ్చు’తో ఛాలెంజ్ ఏంట్రా బాబు .. మెంటలెక్కిపోతున్న ఆడియన్స్..

Bigg Boss Today Promo 2: ‘బొచ్చు’తో ఛాలెంజ్ ఏంట్రా బాబు .. మెంటలెక్కిపోతున్న ఆడియన్స్..

Bigg Boss Today Promo 2: బిగ్ బాస్ సీజన్ 8 లో ఏడో వారం నామినేషన్స్ తర్వాత హౌస్ లో కొత్త టాస్క్ లను బిగ్ బాస్ ఇస్తున్నాడు .. మొన్న , నిన్న హౌస్ లో ఛార్జింగ్ టాస్క్ ను ఇచ్చాడు . ఆ టాస్క్ లో హౌస్ మేట్స్ ఏకంగా కొట్టుకొనే వరకు వెళ్లారు. ఇక ఆ తర్వాత ఒక్కో కంటెస్టెంట్ ఛార్జింగ్ కోసం యుద్దాలే చేశారు. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమో ఆసక్తిగా మారింది . ఆ ప్రోమోలో ఒక సీరియస్ టాస్క్ ను ఇచ్చారు. పగటిపూట హాయిగా బెడ్డుపై నిద్రబోతున్న అవినాష్-మెహబూబ్‌లను పిలిచాడు బిగ్‌బాస్. ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో చిన్న కప్పుల్లో కాఫీ, వయొలిన్ ఏర్పాటు చేస్తాడు. అవినాష్ మీరు ఇప్పటికే చాలా సార్లు కాఫీ, వయొలిన్ అడిగారు కదా అంటూ బిగ్‌బాస్ చెబుతాడు. దీనికి నవ్వుకుంటూ బిగ్‌బాస్ నేను అడిగింది.. ఒళ్లు నొప్పులు తగ్గడానికి కొట్టే పెయిన్ రిలీఫ్ వాలినీ అంటూ చెబుతాడు. మనోడికి అది చెప్పడం రాక వయొలిన్ అని చెప్పినట్లున్నాడు. ఇక బిగ్ బాస్ దాన్ని తీసుకొచ్చి పారేసాడు .. తాజాగా విడుదలైన ప్రోమో హైలెట్స్ ను ఒకసారి చూద్దాం ..


బొచ్చు ఛాలెంజ్ టాస్క్ లో పృథ్వీ , అవినాష్ ..

అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు ,పృథ్వీ గడ్డం చూసి గౌతమ్ నువ్వు గడ్డం తీసేసాక ఒక ఫోటో పంపవా అని అడుగుతాడు. దీనికి పృథ్వీ నవ్వుకోగా వద్దు ప్లీజ్ అంటూ విష్ణు అంటుంది. ఇక ట్రిమ్మర్‌తో తీసేద్దాం ఏదైతే అదే అయింది అంటూ నిఖిల్ సరదాగా అంటాడు. దీంతో అయ్యో వద్దు బ్రో నేను చచ్చిపోతా.. అసలు నా ఫేస్ గడ్డం లేకుండా చూడలేను అంటాడు పృథ్వీ. ఇక వీళ్లు మాట్లాడుకుంటుంగా టీవీలో పృథ్వీ గడ్డం తీసేసిన కొన్ని ఏఐ ఫొటోలను చూపిస్తాడు బిగ్‌బాస్. ఇవి చూసి పృథ్వీతో పాటు అక్కడ ఉన్న వాళ్లంతా షాక్ అవుతారు. ఏంటి బిగ్ బాస్ ఇదంతా కామెడీగా ఉందని నవ్వుకుంటారు.


ఆ ఫొటోల్లో ఒక్కో దాని కిందా ఒక్కో అమౌంట్ కూడా పెట్టాడు బిగ్‌బాస్. హెయిర్ కట్ చేయించుకుంటే రూ. 25వేలు, గడ్డం మాత్రం తీసెస్తే రూ.50 వేలు, గడ్డం-మీసం రెండూ తీసెస్తే రూ. లక్ష అని రాసి ఉంటుంది. ఇక తర్వాత అవినాష్ ఫొటో కనిపిస్తుంది. లైట్‌గా హెయిర్ కట్ చేయించుకుంటే రూ.25 వేలు, గడ్డం-మీసం తీసేసి హెయిర్ స్పైక్ కటింగ్ చేయించుకుంటే రూ.50వేలు, ఇక ఓ వింత కటింగ్ ఉంది అది చేయించుకుంటే రూ.లక్ష అని ఫోటోల కింద రాసి పెట్టి ఉంటుంది . అవినాష్ , పృథ్వీలను డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో చూసి మా ఇద్దరినే సెలెక్ట్ చేసుకున్నారని బిగ్ బాస్ ను అడుగుతారు. బొచ్చు కట్టింగ్ ఛాలెంజ్ గత సీజన్ లో కూడా ఉంది. అయితే పృథ్వీ మాత్రం గడ్డం తీసేందుకు ఇష్టపడడడు . కానీ అవినాష్ మాత్రం స్పైక్స్ పెట్టించుకుంటాడు. 50 వేల అమౌంట్ ను సంపాదిస్తాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే ఎలా ఉంటుందో చూడాలి..

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×