BigTV English

Viral News: రూ.835 ఖర్చుకు.. రూ.1.2 కోట్లు, వారెవ్వా లక్కంటే ఈ గుమ్మడి కాయల వ్యాపారిదే

Viral News: రూ.835 ఖర్చుకు.. రూ.1.2 కోట్లు, వారెవ్వా లక్కంటే ఈ గుమ్మడి కాయల వ్యాపారిదే

Pumpkin Sale Leads To Rs 1.2 Crore Lottery Win: కాలం అనేది చిత్రవిచిత్రాలను చేస్తుంది. కోటీశ్వరుడిని ఓవర్ నైట్ రోడ్డు మీదకు లాగుతుంది. పేదవాడిని కోటీశ్వరుడిగా మార్చుతుంది. అమెరికాలో గుమ్మడికాయలు అమ్మే వ్యక్తికి అదృష్టం తలుపు తట్టి రాత్రికి రాత్రే ఓటీశ్వరుడిగా మార్చింది. తన తోటలో ఓ గుమ్మడి కాయను అమ్మితే వచ్చిన డబ్బుతో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఈ టికెట్ ఏకంగా రూ. 1.2 కోట్లు గెల్చుకోవడంతో ఆయన జీవితం మారిపోయింది.


10 డాలర్లు పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు    

రాయ్ స్టోరీ అనే వ్యక్తి నార్త్ కరోలినాలో గుమ్మడి కాయలు పండించి అమ్ముతారు. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఆయన కుటుంబాన్ని పోషిస్తాడు. తాజాగా ఓ గుమ్మడికాయను అమ్మారు. దానికి 10 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 835 వచ్చాయి. ఆ డబ్బుతో ఓ లాటరీ టికెట్ ను కొనుగోలు చేశారు. తాజాగా ఈ లాటరీ ఫలితాలను వెల్లడించారు. ఇందులో రాయ్ ఏకంగా 150,000 డాలర్లు గెలిచాడు. భారత్ కరెన్సీలో సుమారు రూ.1.26 కోట్లు దక్కించుకున్నాడు. అనుకోని అదృష్టంతో రాయ్ ఆనందంలో మునిగిపోయారు. “నేను ప్రతి ఏటా గుమ్మడికాయలు పెంచుతాను. వాటిని అమ్ముతాను. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తాను. రీసెంట్ గా నేను ఓ కస్టమర్ కు ఓ గుమ్మడికాయను అమ్మాను. అతడు 10 డాలర్లు(రూ.835) ఇచ్చారు. ఆ డబ్బును పెట్టి నేను లాటరీ టికెట్ కొనుగోలు చేశాను. తాజాగా వెల్లడించన ఫలితాల్లో నేను  150,000 డాలర్లు(రూ.1.2 కోట్లు) గెలిచాను. నాకు ఈ లాటరీ తగులుతుందని అస్సలు ఊహించలేదు” అన్నారు రాయ్.


రూ. 4 కోట్ల లాటరీ గెలుచుకున్న మేరీల్యాండ్ మహిళ

గత కొంతకాలంగా అమెరికాలో చాలా మంది లాటరీల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును దక్కించుకున్నారు. రీసెంట్ మేరీల్యాండ్ కు చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 4 కోట్ల విలువైన లాటరీ గెలుచుకుంది. ఫ్రెడరిక్ కౌంటీకి చెందిన మహిళ సెప్టెంబరు 25న పవర్‌ బాల్ డబుల్ ప్లే టికెట్ ను కొనుగోలు చేసింది. ఈ టికెట్ కు లాటరీ తగలడంతో  ఏకంగా  500,000 డాలర్లు (దాదాపు రూ.4 కోట్లు) గెల్చుకున్నది. ఈ లాటరీతో తన కుటుంబాన్ని జీవితాంతం పోషించుకోవచ్చని ఆ మహిళ సంతోషం వ్యక్తం చేసింది.

రూ. 250తో టికెట్ కొంటే రూ. 25 కోట్ల లాటరీ

ఇక ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌కు చెందిన 62 ఏళ్ల జోస్ డ్యూరాన్ గత ఏడాది ఏప్రిల్ లో 3 డాలర్లు (రూ. 250) పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. లాటరీ ఫలితాల్లో ఆయన టికెట్ కు ఏకంగా  3 మిలియన్ల డాలర్లు (రూ. 25 కోట్లు) గెలుచుకున్నారు. గత కొంతకాలంగా లాటరీ టికెట్లు కొనుగోలు చేసిన వాళ్లు పెద్ద మొత్తంలో నగదు గెలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ల కొనుగోలుకు అమెరికన్లు మొగ్గు చూపుతున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  ఒక్క లాటరీ తగిలినా జీవితం మారిపోతుందని ఆశపడుతున్నారు.

Read Also: కొండ మీద ఏనుగు, అమెరికా పోలీసుల రెస్క్యూ ఆపరేషన్.. ఇదీ అసలు సంగతి!

Related News

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Big Stories

×