Hyper Active Giant King Cobra: మనలో చాలా మంది పాముల్ని చూస్తే భయంతో గజగజ వణికిపోతారు. ఒకవేళ పొరపాటున అవి మన దరిదాపుల్లో కనిపిస్తే.. ఇక అంతే సంగతలు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా పరుగులు తీస్తాము. మరికొందరైతే నిద్రపోతున్నప్పుడు పాము తల్చుకోవడానికి కూడా ధైర్యం చేయరు. సాధారణంగా పాములు అటవీ ప్రాంతాలు, దట్టమైన పొదలు, గుబురుగా ఉండే ప్రదేశాలు, నీళ్లు ఎక్కువగా ఉన్నా ప్రదేశాల్లో కనిపిస్తాయి.
పాములు ఎక్కువగా ఎలుకలను వెడాడుతాయి. వాటినే అవి ఆహారంగా తీసుకుంటాయి. ఎలుకల కోసమే పాములు అప్పుడప్పుడు మన ఇండ్లలోకి చొరబడుతుంటాయి. కొందరైతే పాములనే ధైర్యంగా కొలుస్తుంటారు. అటువంటి వారికి పాములు కనిపిస్తే ధైర్యంగా హారతులు ఇస్తారు. పాముకు కొంచెం కూడా హాని తలపెట్టరు. వెంటనే దాన్ని రక్షించడానికి స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందిస్తారు. మరికొందరైతే పాము కన్పించిన వెంటనే దాని ప్రాణాలు తీసేస్తారు. అయితే పాముల్ని చంపడం మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతుంటారు.
ఇది నిజ జీవితంలో ఎన్నో అవరోధాలను కలిగిస్తుందని భయపడుతుంటారు. మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారని అంటున్నారు. ఆర్థిక సమస్యలతో నానా అవస్థలు పడతారంట. ఇటువంటి వీడియోలే తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇంటర్నెట్ యూజర్లు కూడా పాములకు సంబంధించిన కంటెంట్‌ను చూడటానికి ఎక్కువగా ఇంటరెస్ట్ చూపుతుంటారు. అయితే తాజాగా ఇటువంటి వీడియోనే యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. ఆ వీడియో మనం ఇప్పుడు వరకు చెప్పుకున్న దానికి కాస్త భిన్నంగా ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని చూస్తే ముందు చాలా ధైర్యంగా ఉండాలి.
Also Read: దూడను మింగేసిన భారీ కొండచిలువ.. ముందుకు కదల్లేక..!
ఇక అసలు విషయానికి వస్తే ఈ వీడియో VINDICTIVE RECORDS అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి అప్‌లోడ్ అయింది. ఫుటేజ్‌లో చూస్తే ఓ భారీ కింగ్‌కోబ్రా కనిపిస్తుంది. అది దాదాపు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. చాలా లావుగా ఉంటుంది. ఆ పామును చూడగానే ఎవరికైనా ఒళ్లు జల్దరిస్తుంది. ఎందుకంటే ఆ పాము ఆకారం అంతలా బయపెడుతుంది. అటువంటి పామును ఓ వ్యక్తి సింపుల్‌గా చేతితో పట్టుకుంటాడు. కోబ్రా మాత్రం చంపేద్దాం అన్నట్టుగా అతడిపైకి పడిగవిప్పి బుసలు కొడుతూ దూకుతుంది.
Also Read: పాము-ముంగీసు మధ్య భీకర యుద్ధం.. ఒకదానిపై మరొకటి దాడులు చేసుకుంటూ..
ఆ యువకుడు మాత్రం ఏ మాత్రం.. బెరుకులేకుంగా భారీ కింగ్‌కోబ్రాని చెత్తో పట్టుకొని పైకి లేపుతాడు. కోబ్రా మెలికలు తిరుగుతూ చంపేయాలన్న కోపంతో యువడికిపైకి దూకుతుంది. చుట్టూ ఎవరు కూడా లేరు. ఆ ప్రాంతాన్ని గమనించినట్లయితే అటవీ ప్రాంతంలా కనిపిస్తుంది. రోడ్లు, పక్కన చెట్లు తడిగా ఉన్నాయి. దీన్నిబట్టి అక్కడ వర్షం పడి, ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. వీడియోకి 1,119 మంది కామెంట్లు చేశారు. ఇప్పటికే మిలియన్ల కొద్ది వ్యూస్‌ను ఈ వీడియో సొంతం చేసుకుంది. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ కింగ్ కోబ్రా వీడియో ఇవాళ గూగుల్‌లో ట్రెండ్ అవుతుంది.