BigTV English
Advertisement

Actress Yami Gautham: శుభవార్త.. మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్

Actress Yami Gautham: శుభవార్త.. మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్

Heroine Yami Gautham Welcomes a Baby Boy: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ యమీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె తన అందంతోనే కాదు.. తాను నటనలోనూ ఎంతో అందంగా అద్భుత ప్రదర్శనలు చేస్తూ ఎంతోమందిని అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో కూడా ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలు చేసింది. అయితే, ఈమెకు ఆ ప్రాజెక్టులు అంతగా అచ్చిరాలేదు. కానీ, బాలీవుడ్ లో చేసిన ప్రాజెక్టులు మాత్రం సూపర్ క్లిక్ అయ్యాయి. దీంతో ఆమెకు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇటీవల కూడా ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ ఆర్టికల్ 370లో ఎంతగానో అలరించి ప్రేక్షక హృదయాలను మరోసారి గెలుచుకుంది. అందుకే ఈ హీరోయిన్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.


ఈ స్థాయిలో గుర్తింపు ఉన్న ఈ స్టార్ హీరోయిన్ యామీ డైరెక్టర్ ఆదిత్య ధర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంటిమేట్ సెరమనిలో ఈ జంట పెళ్లి చేసుకుంది. అటు ఫ్యామిలీ లైఫ్ ను, ఇటు ప్రొఫేషనల్ లైఫ్ ను ఈ జంట సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. అయితే, ఈ బ్యూటీఫుల్ దంపతులు తాజాగా ఓ శుభవార్తను చెప్పారు. తమకు కొడుకు పుట్టాడని, అతడిని VEDVID గా పిలుచుకుంటామంటూ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇప్పుడా పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసిన అభిమానులు, సినీ ప్రేక్షకులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు.. వారికి పుట్టిన కొడుకుకు ఆశీర్వచనాలు అందజేస్తున్నారు.

Yami Gautham
Yami Gautham

Also Read: Directors Day: డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్.. అసలుసిసలు అయిన వారే రాలేదంట..


కాగా, యామీ గౌతమ్ పలు తెలుగు సినిమాల్లో నటించింది. యుద్ధం, గౌరవం, కొరియర్ బాయ్ కల్యాణ్ వంటి పలు తెలుగు సినిమాల్లో నటించింది. అయితే, ఆమెకు తెలుగులో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్ సినిమా సమయంలో ఆదిత్య ధర్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తరువాత వీరిద్దరు వివాహం చేసుకున్నారు. అయితే, ఆర్టికల్ 370 మూవీ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో యమీ గౌతమ్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని.. ఓ వైపు ప్రెగ్నెన్సీ.. మరోవైపు సినిమా షూటింగ్.. ఇలా ఆ సమయంలో తను ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే.

ఆర్టికల్ 370 సినిమా విషయమై యామీ గౌతమ్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370కు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న తన కల నిజమైందని, తన కల నిజమైనందుకు తనకు ఆనందంగా ఉందంటూ ఆమె ఎమోషనల్ అయిన విషయం విధితమే.

Also Read: Naga Chaitanya: అక్కినేని గ్యారేజ్ లో మరో కారు.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

అయితే, తాజాగా తమకు కొడుకు పుట్టాడని ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు ఈ పాపులర్ జంట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్, అభిమానులు, సినీ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తూ వారిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారికి జన్మించిన చంటిబాబుకు ఆశీర్వాదాలు అందిస్తున్నారు.

 

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×