Viral Video: మనుషుల కంటే జంతువులకు విశ్వాసం ఎక్కువగా ఉంటుందని చాలామంది చెబుతారు. మనం ఎక్కడికైనా వెళ్తే వచ్చేవరకు ఎదురు చూస్తుంటాయి కొన్ని జంతువులు. మనతో అంతగా కలిసిపోతాయి. కొన్ని జంతువుల గురించి చెప్పనక్కర్లేదు. వెంటాడి మరీ దాడి చేస్తాయి. మధ్యప్రదేశ్‌లో అలాగే జరిగింది. ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులను వెంటాడి మరీ దాడి చేసింది ఆ ఎద్దు.
మధ్యప్రదేశ్‌లోని కట్ని టౌన్‌లో సోమవారం ఓ ఎద్దు విచ్చలవిడిగా దాడి చేసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులపై దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతానికి చాలామంది రావడానికి భయపడ్డారు. దీనికి సంబంధించిన సన్నివేశాలు సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇప్పుడు అవి వైరల్‌గా మారాయి.
శ్రావణ సోమవారం శివుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఉదయాన్ని చాలామంది శివాలయానికి వెళ్లి దర్శించుకుంటారు. అయితే ఆ ఎద్దు మాత్రం ఓ ఇంటి చుట్టూ తిరిగింది. తొలుత ఇంట్లో నుంచి ఓ మహిళ బయటకు వచ్చింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొమ్ములతో పొడిచింది. వెంటనే ఆమె కింద పడిపోయింది.
అయితే ఆ మహిళ ఎటు కదలకుండా అలాగే పడిపోయింది. ఆమె అరుపులు విన్న మరో సభ్యుడు ఇంట్లో నుంచి పరుగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. ఆ మహిళ దగ్గరకు వెళ్లబోయాడు. అతగాడ్ని ఆ మహిళ వద్దకు రాకుండా వెంటాడింది. దాని ధాటికి తట్టుకోలేక ఇంట్లోకి ఆ వ్యక్తి పరుగులు తీయాల్సి వచ్చింది. మరికొందరు దైవ భక్తులు శివుడికి చేయకూడదని తప్పు చేశారని, అందుకే నంది దాడి చేసిందని అంటున్నారు.
ALSO READ: గూగుల్ దయ.. ఇంట్లో నగ్నంగా పోలీసు అధికారి, రూ. 10 లక్షలు జరిమానా
ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురిపై దాడి చేయడంతో వారంతా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటనకు మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత వహించాలని అన్నారు. విచ్చలవిడి తిరుగుతున్న జంతువులను నియంత్రించేందుకు కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ఒక్కో ప్రాంతంలో స్థానికులు ఆ ఎద్దులను ‘మృత్యు ఏజెంట్లు’ అని పిలవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు వీది కుక్కలు ఈ విధంగా చిన్నారులను వెంటాడేవని, ఇప్పుడు ఎద్దుల వంతైందని అంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా అధికారులు విచ్చలవిడిగా తిరుగుతున్న జంతువుల యజమానులపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలని ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ ఒక్క కేసు మాత్రమేకాదు ఆ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్‌ల్లో ఆ తరహా కేసులు అనేకం నమోదు అయ్యాయి.
#WATCH | Stray bull on rampage, injures 3 in MP's Katni#MadhyaPradesh #rampage #FPJ pic.twitter.com/81Tqcda4GW
— Free Press Madhya Pradesh (@FreePressMP) July 28, 2025