Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)కు టాలీవుడ్ లో ఎలాంటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన చేసిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయినా కూడా తగ్గేదేలే అన్నట్లుగా మరిన్ని ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ కొత్త సినిమాలతో మన ముందుకు వస్తున్నారు. అయితే అలాంటి విజయ్ దేవరకొండ తాజాగా తన 36వ బర్త్డేని జరుపుకుంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆస్తిపాస్తులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇండస్ట్రీకి వచ్చిన ఇన్ని సంవత్సరాలలో విజయ్ దేవరకొండ ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
విజయ్ దేవరకొండ మొత్తం ఆస్తుల విలువ..
విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో అర్జున్ రెడ్డి(Arjun Reddy), పెళ్లిచూపులు (Pelli Choopulu), గీత గోవిందం(Geeta Govindam), డియర్ కామ్రేడ్(Dear Comrade), టాక్సీవాలా (Taxiwala),ఖుషి (Khushi) వంటి సినిమాలు తప్పితే.. మిగిలిన సినిమాలు అన్నీ ఫ్లాప్ లుగానే మిగిలాయి. గత కొద్ది సంవత్సరాల నుండి వరుస ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నప్పటికీ అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. అయితే అలాంటి విజయ్ దేవరకొండ తన సినిమాలు, బిజినెస్ లు, యాడ్స్ ద్వారా దాదాపు రూ.80 నుండి రూ.90 కోట్ల వరకు ఆస్తిపాస్తులు సంపాదించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు జూబ్లీహిల్స్ లో రూ.50 కోట్ల విలువ చేసే ఖరీదైన ఇల్లు తో పాటు రూ.10 కోట్ల విలువ చేసే కార్లు, ఇతర యాక్సెసరీలు ఉన్నట్టు తెలుస్తోంది.
నటుడు గానే కాదు బ్రాండ్ అంబాసిడర్, నిర్మాతగా కూడా..
ఇక విజయ్ దేవరకొండ ఏకకాలంలో నాలుగైదు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు. అంతేకాకుండా రౌడీ (Rowdy) అనే పేరుతో క్లాత్ స్టోర్ ని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈయన స్థాపించిన ఈ రౌడీ క్లాత్స్ కి మార్కెట్లో మంచి ఇమేజ్ కూడా ఉంది. అలా ఓవైపు హీరోగా మరోవైపు బిజినెస్ లు చేస్తూనే.. ‘కింగ్ ఆఫ్ ది హిల్స్’ (King Of The Hills) అనే బ్యానర్ స్థాపించి..’మీకు మాత్రమే చెబుతా’ (Miku Matrame Chebutha) అనే సినిమాతో నిర్మాతగా కూడా మారారు.. ఇక విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయన ఒక్కో సినిమాకి రూ.20 నుండి 22 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు విజయ్ దేవరకొండ సంపాదించిన ఆస్తులన్నీ తన తల్లి మాధవి (Madhavi) పేరిటే ఉన్నట్టు తెలుస్తోంది.
మరో రెండు రోజుల్లో కింగ్డమ్ తో రాబోతున్న విజయ్ దేవరకొండ..
ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే..ఈయన మరో రెండు రోజుల్లో కింగ్డమ్ మూవీ (Kingdom Movie) తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. జూలై 31న ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రముఖ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ALSO READ:Jyothi Krishna HHVM : క్రిష్ ఇచ్చిన కథను ఏం మార్చలేదు… అసలు ట్విస్ట్ పార్ట్ 2లో ఉంటుంది