BigTV English

A Drunk man Sleep on the Railway Track: ఏం తాగినవ్ రా బాబూ.. రైల్వే ట్రాక్‌పై పడ్డుకున్నావ్!..వీడియో వైరల్

A Drunk man Sleep on the Railway Track: ఏం తాగినవ్ రా బాబూ.. రైల్వే ట్రాక్‌పై పడ్డుకున్నావ్!..వీడియో వైరల్

A Drunk man Sleeping on the Railway Track: మందుబాబుల చేష్టలు మామూలుగా ఉండవ్ . కొంతమంది తాగి హంగామా చేసిన ఘటనలు ప్రతీ రోజూ ఎక్కడోచోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, ఓ యువకుడు ఫుల్‌గా తాగి ఏకంగా రైల్వే ట్రాక్‌ మధ్యలో పడుకున్నాడు. అదే ట్రాక్‌పై రైలు వెళ్లినా చలించలేదు. అదృష్టవశాత్తు బతిపోయాడు. అయితే, ఓ వ్యక్తి నిద్ర పోయినట్లు తెలుసుకున్న లోకోపైలట్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో చోటుచేసుకుంది.


పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి చేసే సమయానికి ఆ వ్యక్తి నిద్రలోనే ఉండడంతోపాటు ఎలాంటి గాయాలు కాలేదు. విచారణలో ఆ యువకుడి పేరు అమర్ బహదూర్ అని, నేపాల్ వాసిగా గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవుతోంది. ఈ వీడియోను చూసిన కొంతమంది పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో ఇలాంటి ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని కొల్లం జిల్లా ఏడుకాన్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఫుల్ గా తాగాడు అనంతరం మద్యం మత్తులో ఆ ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్ పై పడుకున్నాడు. అయితే ఈ సమయంలో కొల్లం, పునలూర్ రైలు వచ్చింది. ఆ రైలు యువకుడి సమీపానికి వస్తుండగా.. లోకోపైలట్ కు ట్రాక్ పై ఓ యుకుడు పడుకున్నాడనే విషయాన్ని గమనించాడు.


అయితే, ఆ యువకుడి తల ఓ ట్రాక్ పై ఉందనే విషయాన్ని గమనించి వెంటనే రైలు నిలిపివేశాడు. దీంతో అతడికి కొంత దూరంలో రైలు ఆగిపోయింది. లోకోపైలట్ అప్రమత్తంతో అతడు బతికిపోయాడు. తర్వాత ప్రయాణికులతో కలిసి లోకోపైలట్ అతడి వద్దకు వెళ్లి నిద్ర లేపారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడిని ఎజుకోన్ పోలీసులకు అప్పగించారు. కాగా, ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటుచేసుకోవడంతో ఆందోళన నెలకొంది. మద్యం మత్తులో యువకులు ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×