BigTV English

NTRNeel: ఇట్స్ అఫీషియల్.. ఎన్టీఆర్ – నీల్ కాంబో.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాణ సంస్థ

NTRNeel: ఇట్స్ అఫీషియల్.. ఎన్టీఆర్ – నీల్ కాంబో.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాణ సంస్థ

NTR Prasanth Neel: ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తనకు ఇంతక ముందు ‘జనతా గ్యారేజ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే ఇందులో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఒకెత్తయితే.. గ్లింప్స్, సాంగ్స్ మరో ఎత్తు అనే చెప్పాలి. ముఖ్యంగా గతంలో గ్లింప్స్ రిలీజ్ చేస్తూ మేకర్స్ అదిరిపోయే ట్రీట్ అందించారు. అందులో ఎన్టీఆర్ మాస్ యాక్షన్ లుక్‌కి సినీ అభిమానులు ఫిదా అయిపోయారు. అలాగే సినిమా నుంచి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్‌‌ను సొంతం చేసుకున్నాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ కావడానికి సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాకి సంబంధించిన అప్డేట్ తాజాగా బయటకొచ్చి నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఎన్టీఆర్ తన కెరీర్‌లో 31వ సినిమాను ప్రశాంత్ నీల్‌తో దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే వచ్చిన అనౌన్స్‌మెంట్లు అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. కేజీఎఫ్ 1,2 అండ్ సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా తెరకెక్కిస్తుండటంతో యావత్ సినీ ప్రియుల్లో హైప్ క్రియేట్ అయింది.


Also Read: కాస్కోండిరా అబ్బాయిలు.. ఎన్టీఆర్- నీల్ మొదలెట్టేస్తున్నారు

అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడొస్తుందా అని వేయి కళ్లతో వెయిట్ చేసిన వారికి తాజాగా ఉపశమనం లభించింది. ఇవాళ ఈ సినిమా అఫీషియల్‌గా పట్టాలెక్కింది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకకు ఎన్టీఆర్ తన భార్య, పిల్లలు, అన్నయ్య కళ్యాణ్ రామ్‌తో వచ్చాడు. తారక్ భార్య ప్రణతి కెమేరా స్విచ్చాన్ చేసి ప్రారంభించారు.

ఈ ప్రారంభ వేడుకలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కుటుంబ సభ్యులు, కళ్యాణ్ రామ్, మైత్రీ నవీన్, రవి శంకర్, దిల్ రాజు, హర్షిత్ వంటి నిర్మాతలు పాల్గొన్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే పూజా కార్యక్రమంతో పాటు మరో అప్డేట్‌ కూడా వచ్చింది. మూవీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ చిత్రాన్ని 2026 జనవరి 9వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ అప్డేట్‌తో సినీ ఫ్యాన్స్ ఫుల్ ఖుస్ అవుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×