BigTV English

Ghaziabad Viral Video: కదులుతున్న ట్రక్కులో చెలరేగిన మంటలు.. బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్

Ghaziabad Viral Video: కదులుతున్న ట్రక్కులో చెలరేగిన మంటలు.. బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్

Ghaziabad Viral Video: ఘజియాబాద్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేపర్ వ్యర్థాలను(చెత్తను) తరలిస్తున్న ఓ ట్రక్కులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్‌కి గానీ, మరెవరికీ గానీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం విశేషం. లారీలో మంటలు చెలరేగడంతో డ్రైవర్ వెంటనే వాహనాన్ని పక్కకు పెట్టి బయటకు దూకాడు.


ప్రాథమిక విచారణలో భాగంగా వాహనంలోని సీఎన్‌జీ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నిన్న అంటే జూలై 8వ తేదీన పింక్ బూత్ జల్ నిగమ్ ఎదురుగా ఉన్న విజయనగర్‌ వద్ద ఓ ట్రక్కులో మంటలు చెలరేగినట్లు సమాచారం. మధ్యాహ్నం 3:12 గంటలకు ఘజియాబాద్ జిల్లాలోని కొత్వాలి ఫైర్ స్టేషన్‌కు ఈ సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ తెలిపింది.

సమాచారం అందుకున్న వెంటనే, ఫైర్ స్టేషన్ కొత్వాలి నుండి క్రాసింగ్ రిపబ్లిక్ వద్ద మంటల్లో తగలబడుతున్న ట్యాంకర్ వద్దకు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా, ట్రక్కులో పేపర్ వ్యర్థాలతో నిండిపోయి భారీగా మంటలు వ్యాపించాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. కొంత సమయం తరువాత, మంటలను పూర్తిగా ఆర్పివేశారు.


వాహనంలో సీఎన్‌జీ ఉన్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. మోహన్‌నగర్‌ నుంచి దాద్రీ (నోయిడా)కి ట్రక్కు వెళ్తోందని అన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. లారీలో మంటలు చెలరేగడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌ మళ్లించినట్లు పోలీసులు వెల్లడించారు. మంటలను ఆర్పిన తర్వాత ట్రక్కును పక్కన పెట్టినట్లు పేర్కొన్నారు. వాహనంలోని సీఎన్‌జీలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Rajasthan Woman: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. ఇప్పటికైనా యుద్ధం ఆపుతారా?

Monkey incident: చెట్టెక్కిన కోతి.. కింద కురిసిన నోట్ల వర్షం.. ఎంత అదృష్టమో!

Viral Video: ఇంటర్వ్యూలో అడ్డంగా బుక్కైన తెలుగు అమ్మాయి!

Viral News: ఆ చికెన్ మీద మనసు పడ్డ బ్లాక్ పింక్ లిసా, వరల్డ్ వైడ్ గా వైరల్ అంతే!

Viral News: ఒక్క రోజు రెస్టారెంట్ బిల్లు కోటి రూపాయలా? బంగారం ఏమైనా తిన్నార్రా బాబూ?

DMart: డిమార్ట్ లో ఈ మహిళల్లా అస్సలు చేయకండి, లేదంటే బుక్కవ్వడం పక్కా!

Big Stories

×