Sherrnavaz Jijina Gives Update About Mirzapur 4: కోవిడ్ దాటికి ఇండియా అంతా అల్లకల్లోలం అయింది. అందులో మెయిన్‌గా మూవీ ఇండస్ట్రీ చాలా మట్టుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అందులో భాగంగానే మూవీ థియేటర్లు మూతపడ్డాయి. ఇందులో సినిమాలు థియేటర్‌లో ఆడకపోవడం ద్వారా అందరూ కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిన్న సినిమాలన్నింటిని ఓటీటీలో పార్ట్‌లుగా విభజించి ఓటీటీలో రిలీజ్ చేసేందుకు అనువుగా ఉంటుందని నిర్ణయం తీసుకున్నారు. అందుకే సిరీస్‌లుగా ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు.
ఇక ఇందులో అత్యధిక జనాధరణ పొందిన వెబ్‌సిరీస్‌ల్లో మిర్జాపుర్ సిరీస్ ఒకటి. ప్రస్తుతం దీని సీక్వెల్‌గా మూడో సీజన్ మీర్జాపూర్ 3 అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల రిలీజైన ఈ సీజన్ మంచి ఆడియెన్స్ నుండి మంచి ఆదరణను పొందింది. ఇందులో నుండే తాజాగా నాలుగో భాగంపై నటి కీలక అప్‌డేట్ ఇచ్చింది. మీర్జాపూర్ ఫస్ట్ పార్ట్ నుంచి ఆ సిరీస్‌లో భాగమైన పార్ట్ 4 సిరీస్‌లో భాగమైన నటి షెర్నావాజ్ జిజినా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.
Also Read: క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, ఎప్పుడు, ఎక్కడంటే..?
ప్రస్తుతం మీర్జాపూర్ 4 స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతోంది. ఎంతోమంది దానికోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మీర్జాపూర్ 4 పార్ట్ ఆడియెన్స్ అంచనాలను మించి ఉంటుందని తెలిపింది. అలాగే ఈ సిరిస్ కోసం చాలామంది పనిచేస్తున్నారని, ఆడియెన్స్ అంచనాలకు మించి ఉండేలా ఈ మూవీని రూపొందించనున్నట్లు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. టీమ్ మెంబర్స్ అంతా టాలెంటెడ్ వ్యక్తులు. ఒకదాని తరువాత మరో సీజన్‌ని వెంటనే రిలీజ్ చేయడానికి వాళ్లు చేసే వర్క్ డెడికేషన్‌పై నాకు పూర్తి నమ్మకం ఉందని నటి తెలిపారు. ఇక మీర్జాపూర్ 4 త్వరలోనే రిలీజ్‌కు రెడీగా ఉందని ఆమె తెలిపింది.
మీర్జాపూర్ సిరీస్‌పై వస్తోన్న కామెంట్లపై షెర్నావజ్ రియాక్ట్ అయ్యారు. మిగతా వాటితో పోలిస్తే మీర్జాపూర్ చాలా ఢిఫరెంట్‌గా ఉంటుందని తెలిపింది. ఇందులో ఎక్కువగా గ్రాఫిక్స్ అస్సలు వాడలేదని తెలిపింది. అందుకే కాస్త లేటు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోందని తెలిపింది. దీని ఫస్ట్ ఫార్ట్ రిలీజ్ టైమ్‌లో ఎంతోమంది నెగటివ్ కామెంట్స్ చేశారు. చాలా క్రూయల్‌గా ఉందని విమర్శించారు. అయినా అది సూపర్ హిట్ మూవీగా నిలిచిందని నటి షెర్నావాజ్ జిజినా తెలిపింది. అంతేకాదు ఇలాంటి సీన్స్ తీయడం చాలా కష్టమని తెలిపింది. ఆడియెన్స్ ఏది చూడాలనుకుంటున్నారో దాన్ని మేం అందిస్తామని తెలిపింది. ఒకవేళ ఇందులో హింసను ఆడియెన్స్ చూడలేమనుకుంటే ఫీడ్ బ్యాక్ అందిస్తే దానికనుగుణంగా ఈ మూవీని అందించనున్నట్లు తెలిపింది. చూడాలి మరి ఈ మూవీ ఆడియెన్స్‌ని ఏ విధంగా ఎంటర్‌టైన్ చేయనుందో.