Viral Video: ఏంటో ఈ మధ్య అసలు గొడవలు దేనికి పెట్టుకుంటున్నారో కూడా అర్థం కాకుండా పోతుంది. చిన్న దానికే గొడవలు, హత్యలకు దారి చేసిన ఘటనలు కూడా ఎన్నో వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. చిన్న చిన్న వాటి కోసం అనవసరంగా గొడవలు పడుతూ గాయాలపాలవుతుంటారు. అయితే గొడవ పడడానికి ఓ పెద్ద కారణం ఉన్నా దానికి ఓ విలువ ఉంటుంది. కానీ కారణం వింటేనే అసలు దీని కోసం ఎవరైనా గొడవ పడతారా అనే గొడవలు కూడా చాలానే ఉన్నాయి. అయితే తాజాగా ఇలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది. అసలు ఈ ఘటన తెలిస్తే ఎవరైనా సరే దీని కోసం గొడవ పడతారా అని అంటారు. అయితే అసలు దీనికి గల కారణం ఏంటో తెలుసుకుందాం.
కేవలం రూ. 10 జిలేబీ కోసం ఇద్దరు వ్యక్తులు దారుణంగా కొట్టుకున్నారు. అది కూడా మామూలుగా కాదు. కింద మీద పడి మరి చితకబాదుకున్నారు. రూ. 10 జిలేబీ కోసం షాప్ యజమాని, కొనుగోలు దారుడి మధ్య గొడవ జరిగింది. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియార్ లో వెలుగుచూసింది. మురార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బారాదరి కూడలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడే ఓ జిలేబీల దుకాణం ఉంది. అయితే అక్కడ అద్దెకు తీసుకుని టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఉదయం పూట టిఫిన్లు, సాయంత్రం స్నాక్స్ వంటివి అమ్ముతుంటాడు.
అయితే రాత్రి వేళ విక్రయించే స్నాక్స్ లో జిలేబీలు కూడా అమ్ముతుంటాడు. ఈ తరుణంలో రవి శ్రీవాస్ అనే ఓ వ్యక్తి వచ్చి జిలేబీలు కావాలని అడిగాడు. తన అనుచరులతో కలిసి వచ్చి కేవలం రూ.10లకు జిలేబీ ఇవ్వాలని అడగడంతో, దీనికి దుకాణాదారుడు నిరాకరించాడు. రూ. 10కు జిలేబీ రాదని చెప్పాడు. దీంతో శ్రీవాస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఈ తరుణంలో శ్రీవాస్ తో సహా వచ్చిన వ్యక్తులు దుకాణాదారుడితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాపు యజమాని నిరంజన్ గుర్జార్ సహా శ్రీవాస్ కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో నెట్టిం వైరల్ కావడంతో నెటిజన్లు కూడా జిలేబీ కోసం కొట్టుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు.
ग्वालियर
⏭️10 रुपए की जलेबी के पीछे विवाद
⏭️ग्राहक और दुकानदार में मारपीट
⏭️मुरार थाना के बारादरी चौराहे की घटना
⏭️नाश्ते की दुकान पर हुआ जमकर विवाद
⏭️10 रुपए की जलेबी के लिए ग्राहक ने दुकानदार से विवाद किया#gwalior | @GwaliorComm | @MPPoliceDeptt | pic.twitter.com/743HptT85D— Samachar News India (@SamacharNewsIND) September 14, 2024