Viral Video: పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తుల జీవితాలను ఒకటి చేసేది అని అంటారు. ముఖ్యంగా మన భారతదేశంలో వివిధ సంప్రదాయాలతో పెళ్లిళ్లను చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఇలాంటి సాంప్రదాయాలు చాలా చోట్ల కనిపించడం లేదు. పెళ్లి అంటే చాలు చాలా హడావుడి చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిళ్లు ఎంతో అంగరంగ వైభవంగా, విపరీతమైన ఖర్చుతో చేస్తున్నారు. అయితే ఇలా చేసిన పెళ్లి మరియు దానికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూటింగ్ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
పెళ్లికి చేసే ఖర్చుతో సరిసమానంగా ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ లో నిర్వహిస్తున్నారు. విదేశాల్లో సరికొత్త ప్రాంతాల్లో వీటిని చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి వీడియోలు తరచూ వైరల్ అవుతున్న తరుణంలో ఏదో ఒక వినూత్నమైన వీడియో చేసి తాము కూడా ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. అయితే సాధారణంగా పెళ్లి తంతు ముగిసిన తర్వాతే ఫస్ట్ నైట్ కార్యక్రమం ఉంటుంది. కానీ ఓ జంట మాత్రం ప్రీ వెడ్డింగ్ ఫస్ట్ నైట్ పేరిట చేసిన ఓ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ జంట తమ పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ ఫస్ట్ నైట్ అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫస్ట్ గదిని పూలు, దీపాలతో అలంకరించారు. అంతేకాదు అమ్మాయి పాల గ్లాసు చేతిలో పట్టుకుని, అబ్బాయి చేతికి పువ్వులు చుట్టుకుని గదిలోకి వెళ్లారు. ఈ తరుణంలో వారి స్నేహితులు దీనిని వీడియోగా చిత్రీకరించారు. అయితే ఇది నిజమైనదా లేక వీరు కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఇలా చేశారా అనే విషయం మాత్రం తెలియదు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది.
కొత్త ట్రెండ్..: ఫ్రీ ఫస్ట్ నైట్ షూట్.. pic.twitter.com/sFANzr9T0k
— Govardhan Reddy Dasari (@SportsNewsInd24) July 28, 2024