BigTV English

Viral Video: వామ్మో.. ఏంటి ఆ తునీగల గుంపు.. మేఘాలను ఆక్రమించేసాయండోయ్..

Viral Video: వామ్మో.. ఏంటి ఆ తునీగల గుంపు.. మేఘాలను ఆక్రమించేసాయండోయ్..

Viral Video: తరచూ ప్రపంచంలో ఊహించని ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గత కొంత కాలంగా భూకంపాలు, సునామీ, భారీ వర్షాలు, వరదలు, కరువులు వంటి చాలా రకాల విపత్తులు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతతున్నాయి. ఈ తరుణంలోనే అగ్రరాజ్యం అమెరికాలో వింత ఘటన వెలుగుచూసింది. యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న ఐలాండ్ లో వెస్టర్లీలో గల మిస్ క్వామికట్ స్టేట్ బీచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. బీచ్ వద్ద ఊహించని అతిథితులు దర్శనమిచ్చారు. దీంతో అక్కడి స్థానికులు, పర్యాటకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.


వైరల్ అవుతున్న వీడియోలో తూనీగలు పెద్ద గుంపుగా దర్శనమిచ్చాయి. ఏకంగా ఆకాశాన్నే ఆక్రమించేశాయి. ఎక్కడ చూసినా తూనీగలు కనిపించడంతో పర్యాటకులు ఆశ్చర్యానికి గురయ్యారు. బీచ్ వద్ద ఎంజాయ్ చేయాలని, హాయిగా సముద్రపు నీటి పక్కన పడుకుని విశ్రాంతి తీసుకోవాలని వెళ్లి ఇలాంటి ఘటన ఎదురుకావడంతో షాక్ అయ్యారు. దీంతో వెంటనే అక్కడి వారంతా వీడియోలు, ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

మరికొంత మంది అవి ఏవో విషపూరిత కీటకాలు అనుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ తరుణంలో అక్కడి నుండి పరుగులు తీశారు. అంతేకాదు మరికొంత మంది టవాల్ కప్పుకుని మరి అక్కడ ఉన్నారు. అయితే బీచ్ లో ఇంత పెద్ద సంఖ్యలో తూనీగలు దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు తూనీగలు ఇంత పెద్ద సంఖ్యలో బీచ్ వద్ద చేరుకోడానికి గల కారణం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో దీనికి నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ప్రళయం రాబోయే ముందు సంకేతం అంటూ చర్చించుకుంటున్నారు.


Related News

Viral video: పార్లమెంటును తగలబెట్టేసి రీల్స్ చేసిన జెన్ జెడ్ నిబ్బాలు.. ఇది అవినీతిపై పోరులా లేదే?

Delhi News: మహీంద్రా షోరూమ్‌.. థార్‌ ఎస్‌యూవీ ఒక్కసారిగా పల్టీలు, వైరల్ వీడియో

Gigi Hadid: కేవలం ఆ టేపు చుట్టుకుని నడిచినందుకు రూ.80 కోట్లు చెల్లించారట.. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటీ?

Viral Video: మినీ బస్సులో సముద్రంలో షికారు.. ఒక్క భారీ కెరటంతో సీన్ మారిపోయింది!

Viral News: కొట్టేయడం నా హాబీ.. చోరీ కేసులో మహిళ సర్పంచ్ అరెస్ట్, ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు ఔట్!

Viral Video: పరాయి మగాడితో అడ్డంగా దొరికిన భార్య.. తట్టుకోలేక భర్త..

Big Stories

×