BigTV English

Discounts on Honda cars: కారు కొనాలంటే ఇదే బెస్ట్​ టైమ్.. హూండా మోడళ్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఏకంగా రూ.96 వేలు పొందొచ్చు..!

Discounts on Honda cars: కారు కొనాలంటే ఇదే బెస్ట్​ టైమ్.. హూండా మోడళ్లపై ఆఫర్లే ఆఫర్లు.. ఏకంగా రూ.96 వేలు పొందొచ్చు..!

Discounts on Honda Cars In August: ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ వాహనాల సేల్స్‌ను మరింత పెంచుకునేందుకు తరచూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలాగే ఏవైనా పండుగలు ఉంటే.. ముందుగా తమ కార్లపై డిస్కౌంట్లు అందించి వాహనప్రియులను ఆకట్టుకుంటుంటాయి. ఇక మరికొద్ది నెలల్లో పండుగ సీజన్ స్టార్ట్ కాబోతుంది. దీంతో ప్రముఖ కంపెనీలు తమ కార్ల అమ్మకాలు పెంచుకునేందు సిద్ధమవుతున్నాయి.


అంతేకాకుండా ఈ నెల అంటే ఆగస్టులో ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అందులో ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం హూండా ఒకటి. హూండా కంపెనీ ఈ నెల (ఆగస్టు)లో తన ఫోర్ట్‌ఫోలియోలో అత్యధిక సెల్లింగ్ అయిన వాహనాలపై ఆఫర్లు ప్రకటించింది. హూండా ఎలివేట్, సిటీ, అమేజ్‌లపై అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. అయితే ఈ మోడళ్లపై ఎంతెంత మేర ఆఫర్లు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

హూండా ఎలివేట్


హూండా ఎలివేట్ ఎస్యూవీ గతేడాది లాంచ్ అయింది. ఈ మోడల్‌పై కంపెనీ ఆగస్టు నెలలో దాదాపు రూ.65,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో ఒక్క క్యాష్ డిస్కౌంట్‌ మాత్రమే కాకుండా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా కంపెనీ తన యజమానుల కోసం ఎలివేట్ ఎస్యూవీపై మూడేళ్ల మెయింటెనెన్స్ ప్యాకేజీని కూడా ఫ్రీగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో నాలుగు వేరియంట్లు ఉన్నాయి. అవి ఎస్ వి, వి, విఎక్స్, జెడ్‌ఎక్స్ వేరియంట్లు. కాగా ఈ హూండా ఎలివేట్ రూ.11.58 లక్షల నుంచి రూ.16.20 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య ఉంటుంది.

Also Read: సింగిల్ ఛార్జింగ్‌‌పై 450 కి.మీ మైలేజీ.. మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు ఏముందబ్బ..!

హూండా అమేజ్

హూండా అమేజ్ కారుకు మంచి డిమాండ్ ఉంది. ఇది హూండా కార్స్ లైనప్‌లో అతి చిన్న కారు. ఈ కారుపై ఆగస్టు నెలలో భారీ తగ్గింపు లభిస్తుంది. దాదాపు రూ.96,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, లాయల్టీ బోనస్, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో సహా ఇతర బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ నెలలో (ఆగస్టు) ఈ వాహనాన్ని కొనుక్కున్న వారికి మూడు సంవత్సరాల ఫ్రీ మెయింటెనెన్స్ ప్యాకేజీని కంపెనీ అందిస్తుంది. దీని ధర రూ.7.93 లక్షల నుంచి రూ.9.86 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య ఉంటుంది.

హూండా సిటీ

కంపెనీ హూండా సిటీ, సిటీ హైబ్రిడ్ సెడాన్లపై ఈ నెల (ఆగస్టు)లో భారీ తగ్గింపు అందిస్తుంది. దాదాపు రూ.90,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. సెడాన్ ఐసీఈ-ఓన్లీ వెర్షన్‌పై దాదాపు రూ.88,000 విలువైన బెనిఫిట్స్ పొందొచ్చు. అందులో క్యాష్ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్, లాయల్టీ బెనిఫిట్‌తో సహా మరిన్ని ఆఫర్లు ఉన్నాయి. ఈ కారు పై కూడా కంపెనీ ఈ ఆగస్టులో ఉచితంగా మూడేళ్ల మెయింటెనెన్స్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ హూండా సిటీ సెడాన్ రూ.12.08 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. దీని స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ రూ.20.55 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో ఉంది.

Related News

iPhone 17 Prices: ఐఫోన్ 17 ధరలు షాక్! భారత్ vs అమెరికా vs జపాన్ – తెలుసుకున్నారా?

BSNL Prepaid Plan: ఏడాది వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాల్స్.. తక్కువ ధరకే BSNL క్రేజీ ప్లాన్!

Oppo Reno13 Pro: ప్రపంచంలోనే మొదటి 108ఎంపీ సెల్ఫీ ఫోన్.. ఒప్పో రెనో 13 ప్రో 5జీ ప్రత్యేకతలు

DMart: ఐటీ జాబ్ కంటే డిమార్ట్ లో ఉద్యోగం బెస్ట్, సాలరీతో పాటు ఇన్ని సౌకర్యాలా?

Jio Entertainment: జియో యూజర్ల కోసం ప్రత్యేక ఎంటర్టైన్‌మెంట్.. అదృష్టం పరీక్షించండి!

UPI New Rules: యూపీఐ లావాదేవీలకు షాక్‌! సెప్టెంబర్ 15 నుంచి రూల్స్ మార్చిన ప్రభుత్వం

Big Stories

×