BigTV English
Advertisement

Beautiful Video: వాట్ ఏ వండర్.. అతి పెద్ద క్లాక్ టవర్‌పై ఉరుములు, మెరుపులు..

Beautiful Video: వాట్ ఏ వండర్.. అతి పెద్ద క్లాక్ టవర్‌పై ఉరుములు, మెరుపులు..

Beautiful Video: ప్రపంచంలో ఎన్నో వింత ప్రదేశాలు ఉన్నాయి. చారిత్రాత్మక కట్టడాల నుంచి మొదలుకుని ప్రస్తుతం అత్యంత అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. ఒక్కో కట్టడానికి ఒక్కో చరిత్ర ఉంది. కొన్ని కేవలం ఆకట్టుకోవడానికి మాత్రమే కట్టబడి ఉంటే కొన్ని మాత్రం మతపరమైన గుడి గోపురాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అతిపెద్దవిగా పేరుగాంచినవి అయి ఉన్నాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అతి పెద్ద కట్టడాలు నిర్మించబడి ఉన్నాయి.


ప్రపంచంలో ప్రతీ చోట ఇస్లాం మతం వ్యాపించి ఉంది. ఇస్లాం మతస్తులు పూజించుకునే విధంగా అంటే ప్రార్థనలు చేసుకునే విధంగా ప్రతీ ప్రదేశంలోను ఇస్లాం మతానికి సంబంధించిన దేవుడు అల్లా మసీదులు కూడా నిర్మించబడి ఉన్నాయి. అయితే అన్నింటిలో కన్నా ఇస్లాం మతంలో మక్కా అనేది అత్యంత పవిత్రమైన, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదేశంగా పేరుగాంచింది. ఇస్లాం మతంలో పవిత్రమైన స్థలంగా ప్రసిద్ధి గాంచిన మక్కాలోని క్లాక్ టవర్ ప్రపంచంలోనే అతిపెద్ద క్లాక్ టవర్ గా గుర్తింపు పొందింది.

తాజాగా మక్కా క్లాక్ టవర్ పై ఓ అతిపెద్ద మెరుపు, ఉరుములు చోటుచేసుకున్నాయి. దీంతో మక్కా క్లాక్ టవర్ పై మెరుపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతి పెద్దగా, భయంకరంగా చోటుచేసుకున్న ఆ మెరుపు వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇటీవల మక్కాలో భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ సమయంలోనే మక్కా క్లాక్ టవర్‌పై ఓ అతి పెద్ద మెరుపు పడింది. ఈ మెరుపు ఎంతో భయానకంగా ఉంది. అక్కడ ఒకవేళ ఉన్న వారికి అయితే ఏదో పెద్ద శబ్ధంతో భూకంపం వచ్చిందో, ప్రళయం వచ్చిందో అనే మాదిరి అనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. చూడడానికి భయంకరంగా ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది. పెద్ద వెలుతురు, శబ్ధాలతో మెరిసిన మెరుపు ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిని నెటిజన్లు కూడా విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోకు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు దీనిపై నెటిజన్లు కూడా విపరీతంగా స్పందిస్తున్నారు.


Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×