BigTV English
Advertisement

BJP: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒవైసీ ఉపముఖ్యమంత్రా?: బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి ఫైర్

BJP: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒవైసీ ఉపముఖ్యమంత్రా?: బీజేఎల్పీ మహేశ్వర్ రెడ్డి ఫైర్

HYDRAA: కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా సంచలనంగా మారింది. ఏ జిల్లాలో చూసినా హైడ్రా గురించి చర్చ జరుగుతున్నది. కొన్ని జిల్లాలైతే తమకూ హైడ్రా సేవలు కావాలని అడుగుతున్నాయి. స్టేట్ లెవల్‌లో హైడ్రాపై ఫుల్ హైప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కమిషనరా? లేక పొలిటికల్ లీడరా? ఆయనకు రాజకీయ సోకు ఉంటే ఖాకీ బట్టలు వదిలేసి ఖద్దరు బట్టలు వేసుకోవాలని పేర్కొన్నారు.


హైడ్రా కేవలం హిందువుల నిర్మాణాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తు్న్నదని బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సలకం చెరువులో ఒవైసీ నిర్మాణాలకు ఉన్న షరతులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్తి రాజేశ్వర్ రెడ్డికి వర్తించవా? అని ప్రశ్నించారు. ఒవైసీకి ఆరు నెలల సమయం ఇస్తున్నప్పుడు మిగిలిన వారికి ఎందుకు ఇవ్వరని నిలదీశారు. ఎన్ కన్వెన్షన్‌కు ఎందుకు టైమ్ ఇవ్వలేదని అడిగారు. ఓల్డ్ సిటీలోకి వెళ్లే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి లేదా? దారి తెలియడం లేదా? అని పేర్కొన్నారు. లేక ఒవైసీని ఢీకొట్టే ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. ఒవైసీ సంస్థలో మాత్రమే విద్యార్థులు ఉన్నారా? అని అడిగారు. రంగనాథ్‌కు ఆఫర్ ఇచ్చారేమో అంటూ ఆరోపించారు. హైడ్రా కూల్చివేతలు చూస్తే కేవలం టార్గెట్ చేసి కొన్ని నిర్మాణాలను కూల్చుతున్నారన్న అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఇలాగే ముందుకు సాగితే మాత్రం రంగనాథ్ పై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తామని హెచ్చరించారు.

Also  Read: Bharat dojo Yatra: త్వరలోనే భారత్ డోజో యాత్ర.. వీడియో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. వివరాలిదిగో..


కాంగ్రెస్ పార్టీ రంగనాథ్‌కు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ స్థానం ఇస్తే ఇచ్చుకోనివ్వండని, తమకేం అభ్యంతరం లేదని ఏలేటి పేర్కొన్నారు. కానీ, ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని మాత్రం తాము ఉపేక్షించమని స్పష్టం చేశారు. హిందువుల నిర్మాణాలను మాత్రమే కూల్చేస్తే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒవైసీ డిప్యూటీ సీఎంలా వ్యవహరిస్తు్నారని, అందుకే ఒవైసీ నిర్మాణాలను ముట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. సలకం చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చిన తర్వాతే ఇతర చెరువుల్లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. పాత బస్తీలో ఎన్ని చెరువులున్నాయి? ఎన్ని ఎకరాల భూములు కబ్జాలకు గురయ్యాయనే డేటాను ప్రభుత్వం సేకరించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉన్నదని, అందుకే ఒవైసీ నిర్మాణాలను కూల్చడం లేదని ఆరోపించారు.

రంగనాథ్ ఏం పొడిచారని ఆయనకు హైక్యూరిటీ కల్పిస్తు్న్నారని ఏలేటి ప్రశ్నించారు. తీవ్రవాదులను, టెర్రరిస్టులను పట్టుకున్న పోలీసు అధికారులు ఎంతోమంది ఉన్నారని, వారికిలేని సెక్యూరిటీ రంగనాథ్‌కు ఎందుకు అని నిలదీశారు.

Tags

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Big Stories

×