BigTV English

Anoosha Krishna: తండ్రి వయసున్న నిర్మాత .. ఛాన్స్ ఇస్తా వస్తావా అని అడిగాడు

Anoosha Krishna: తండ్రి వయసున్న నిర్మాత .. ఛాన్స్ ఇస్తా వస్తావా అని అడిగాడు

Anoosha Krishna: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కు గురికాని హీరోయిన్ ఎవరు లేరు అంటే అతిశయోక్తి కాదు. కాకపోతే కొంతమంది చెప్పుకుంటారు.. ఇంకొంతమంది చెప్పుకోరు. ఇక ఈ మధ్య వచ్చే హీరోయిన్లు ఇలాంటి విషయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. తాజాగా కొత్తగా టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ అనూష కృష్ణ సైతం ఆమె క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్లు తెలిపింది.


పేక మేడలు అనే సినిమాతో అనూష తెలుగుకు పరిచయమైంది. విలన్ గా సుపరిచితుడు అయిన తమిళ్ నాటుటడ్ వినోద్ కిషన్ హీరోగా పరిచయమైన ఈ చిత్రం ఈ మధ్యనే రిలీజ్ అయ్యి నిరాశపరిచింది. ఇక సినిమా ఏమో కానీ, అనూష మాత్రం తెలుగు కుర్రాళ్లకు బాగానే నచ్చింది.

తెలుగు రాకపోయినా .. మొదటి సినిమాకే ఎంతో కష్టపడి తెలుగు నేర్చుకొని మాట్లాడి అందరి మనసులను దోచేసింది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన గతం తాలూకు చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. కెరీర్ మొదట్లో ఒక నిర్మాత తనను డైరెక్ట్ గా రమ్మని పిలవడంపై నోరు విప్పింది.


” ఇంజనీరింగ్ అయిపోయాకా.. థియేటర్ ఆర్ట్స్ లో చేరాను.. అక్కడనుంచి సినిమాలపై ఆసక్తితో ఇటు వచ్చాను. నేను ఛాన్స్ ల చూస్తున్న సమయంలోనే ఒక నిర్మాత హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తా.. నేను ఏం చేయమన్నా చేయాలి అని అడిగాడు. అతనికి నా తండ్రి వయస్సు ఉంటుంది.

కూతురులాంటిదాన్ని అని కూడా చూడకుండా వస్తావా అని అడిగాడు. నాకు ఎంగేజ్ మెంట్ అయ్యిందని చెప్పినా.. ఏం పర్లేదు అని చెప్పాడు. ఏం చెప్పాలో తెలియక వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను. క్యాబ్ లో నేను వెక్కి వెక్కి ఏడవడం చూసి డ్రైవర్ నన్ను ఓదార్చాడు” అని ఆమె ఎమోషనల్ అయ్యింది. అంతేకాదు. సదురు నిర్మాతకు కూడా అదే ఫస్ట్ సినిమా అని, బాగా సంపాదించి మొదటి సినిమా తీస్తున్నట్లు కనిపించాడని తెలిపింది. ప్రస్తుతం అమ్మడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×