BigTV English

Qantas flight: విమానం స్క్రీన్లలో ‘అలాంటి’ మూవీ, ప్రయాణీకులు షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

Qantas flight: విమానం స్క్రీన్లలో ‘అలాంటి’ మూవీ, ప్రయాణీకులు షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

Japan-Bound Flight Plays Adult Movie: ఈ రోజుల్లో బస్సు నుంచి మొదలుకొని విమానాల వరకు ప్రయాణీకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు సినిమాలు ప్రదర్శించడంతో పాటు పాటలను ప్లే చేస్తుంటారు. బస్సులో ఒకే టీవీ ఉండగా, విమానాల్లో మాత్రం ప్రతి ప్రయాణీకుడికి ఓ స్క్రీన్ ఉంటుంది. ఎవరికి నచ్చిన సినిమాలు, వీడియోలు వాళ్లు చూసుకోవచ్చు. ఒకే వేళ ఎవరికైనా నచ్చకపోతే ఆఫ్ చేసి హాయిగా పడుకోవచ్చు. తాజాగా ఆస్ట్రేలియా నుంచి జపాన్ కు వెళ్లే విమాన ప్రయాణీకులకు జీవితంలో మర్చిపోలేని ఘటన ఎదురయ్యింది. విమానంలోని ఎంటర్ టైన్ మెంట్ సిస్టమ్ లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో ఏకంగా ఆ వీడియో ప్లే అయ్యింది. ఒక్కసారిగా అందరూ ఇబ్బంది పడ్డారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


క్వాంటాస్ విమానంలో అడల్ట్ కంటెంట్ ప్లే

క్వాంటాస్‌ ఎయిర్‌ లైన్స్‌ కు సంబంధించిన QF59 అనే విమానం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్‌ లోని హనెడాకు వెళ్తోంది. ప్రయాణీకులలో అన్ని వయసుల వాళ్లు ఉన్నారు. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు జర్నీ చేస్తున్నారు. విమాన ప్రయాణం మొదలయ్యాక కాసేపటి ఎయిర్ లైన్స్ సిబ్బంది ప్రయాణీకుల వినోదం కోసం ఓ సినిమాను ప్లే చేశారు. ఆ వీడియోను చూసి ప్రయాణీకులు షాక్ అయ్యారు. ఎందుకంటే అది అశ్లీల వీడియో. విమానంలోని అన్ని స్క్రీన్లలో ప్లే కావడంతో చాలా మంది తీవ్ర అసహనానికి గురయ్యారు. చిన్న పిల్లలతో ఉన్న తల్లిదండ్రులు మరింత ఇబ్బంది పడ్డారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో స్క్రీన్ ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. నానా ఇబ్బండి పడి సుమారు 15 నిమిషాల తర్వాత సదరు వీడియో టెలీకాస్ట్ ను ఆపేశారు. ఆ తర్వాత పిల్లలకు ఇష్టమైన వీడియోను ప్లే చేశారు.


విమాన సిబ్బందిపై ప్రయాణీకుల ఆగ్రహం

ఈ ఘటనపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన సిబ్బందిపై తమ అసహనాన్ని వెళ్లగక్కారు. విమానంలో ఏ వీడియో ప్లే చేయాలో తెలియదా? అయినా, అడల్ట్ కంటెంట్ ఉన్న వీడియోలను ఎందుకు స్టోర్ చేశారంటూ మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోలను షేర్ చేశారు. చిన్నారులు, మహిళలతో వెళ్లే విమానంలో ఇలాంటి వీడియో ప్లే కావడం నిజంగా షాక్ కు గురి చేసిందని ఓ ప్రయాణీకులు కామెంట్ చేశాడు. అడల్ట్ కంటెంట్ ప్లే అవుతున్న సమయంలో కనీసం ఆ వీడియోను ఆఫ్ చేసే అవకాశం లేకపోవడం దారుణమంటూ మరో ప్రయాణీకుడు పోస్టు చేశారు.

క్షమాపణ కోరిన విమాన సంస్థ   

అటు ఈ సంఘటనపై క్వాంటాస్ ఎయిర్ లైన్స్ క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. “ఫ్లైట్ లో ప్లే చేసిన వీడియోలో అడల్ట్ కంటెంట్ ఉన్నట్లు తెలిసింది. ఈ వీడియోతో ఇబ్బంది పడ్డ ప్రయాణీకులను క్షమాపణలు కోరుతున్నాం. పొరపాటును గుర్తించి మా విమాన సిబ్బంది వెంటనే మరొక వీడియోను ప్లే చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. కేవలం టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లే ప్రయాణీకులు ఇబ్బంది పడాల్సి వచ్చింది” అని వెల్లడించింది.

Read Also:రండి బాబు.. రండి.. ఫ్రీగా విమానంలో ప్రయాణించండి, దేశమంతా ఉచితంగా చుట్టేయండి

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×