Airlines Offer: మీకు విమానంలో ఫ్రీగా ప్రయాణించాలని ఉందా? అయితే, మీరు జపాన్ వెళ్లాలి. ఔనండి, అక్కడ ఓ ఎయిర్ లైన్స్ సంస్థ. విదేశీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. పూర్తి వివరాలను చూసేయండి.
జపాన్ ఎయిర్ లైన్స్ విదేశీ ప్రయాణీకులకు అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. జపాన్ దేశంలో ప్రయాణీకులు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తోంది. కేవలం ఫారినర్స్ కే ఈ అవకాశం అందుబాటులో ఉంచింది. ఉత్తర అమెరికా, ఆస్ట్రల్-పసిఫిక్ తోపాటు ఆగ్నేయాసియాలో ఎంపిక చేసిన విదేశీ ప్రయాణీకులకు జపాన్ లో ఉచిత కనెక్షన్ విమానాలను అందుబాటులో తీసుకొచ్చింది. ఇంతకీ, జపాన్ లో ఉచిత దేశీయ విమానాల్లో ఎలా ప్రయాణించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉచిత ప్రయాణం ఎలా అంటే?
జపాన్ లో ఉచితంగా విమానం చేయాలనుకునే వారికి జపాన్ ఎయిర్ లైన్స్ షరతులతో కూడిన ఆఫర్ అందిస్తోంది. ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణీకులు అప్ అండ్ డౌన్ టిక్కెట్లను ఒకేసారి బుక్ చేసుకోవాలి. ఒకేసారి టికెట్ బుక్ చేసుకున్న వాళ్లు జపాన్ లో జపాన్ ఎయిర్ లైన్స్ డొమెస్టిక్ విమానాల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది.
ఏ దేశాల వాళ్లు ఈ ఆఫర్ పొందే అవకాశం ఉందంటే?
అమెరికా, కెనడా, మెక్సికో, హవాయి, గువామ్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, థాయిలాండ్, ఇండియా, వియత్నాం, ఫిలిప్పైన్, ఇండోనేషియా, బీజింగ్, షాంఘై, గ్వాంగ్‌జౌ, డాలియన్, టియాంజిన్ మరియు తైపీ నుంచి జపాన్ కు వచ్చే ప్రయాణీకులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. జపాన్ ఎయిర్ లైన్స్ లో అప్ అండ్ డౌన్ టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణీకులు జపాన్ లోని డొమెస్టిక్ విమానాల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అయితే, జపాన్ లో ఎక్కడెక్కడ వెళ్లాలి అనుకుంటున్నారో టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే వెల్లడించాలి. జపాన్ వెళ్లాల డొమెస్టిక్ విమానాల్లో తిరుగుతామంటే కుదరదు.
ఎప్పటి వరకు ఈ ఆఫర్ పొందే అవకాశం ఉందంటే?
ఈ ఆఫర్ కు సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అనే విషయాన్ని జపాన్ ఎయిర్ లైన్స్ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో భారత్ తో పాటు సదరు కంపెనీ వెళ్లడించిన దేశాల నుంచి జపాన్ కు వెళ్లే ప్రతి ప్రయాణీకుడు ఈ ఆఫర్ ను పొందే అవకాశం ఉంటుంది. జపాన్ కు వెళ్లే ప్రయాణీకులు టోక్యో, హక్కైడో, ఫుకుయోకా, ఒసాకాసా, ఫుకుషిమా, సహా పలు ప్రాంతాల్లో చక్కటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.
ఈ ఆఫర్ లో భాగంగా ఆయా పర్యటక ప్రాంతాలకు వెళ్లేందుకు జపాన్ డొమెస్టిక్ విమానాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే జపాన్ లో ఉన్న అన్ని విమానాశ్రయాల నుంచి నచ్చిన ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, ఉచిత టికెట్లకు పొందేందుకు కొన్నిఅదనపు పన్నులను చెల్లించాల్సి ఉంటుంది. అవి కూడా పెద్ద మొత్తంలో ఏమీ ఉండవని జపాన్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. ఈ ఆఫర్ కు మంచి స్పందన లభిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. జపాన్ కు పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ ఆఫర్ ను తీసుకొచ్చినట్లు తెలిపింది.
Read Also: వీడు మహా కంత్రి.. టికెట్ లేకుండా విమానాల్లో జర్నీ, అదెలా సాధ్యం? సెక్యూరిటీ ఏం చేస్తోంది?