BigTV English

Natty Kumar: పవన్ కాలి గోటికి కూడా ప్రకాశ్ రాజ్ సరిపోడు, మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఖండించలేదే.. నట్టి కుమార్ వ్యాఖ్యలు

Natty Kumar: పవన్ కాలి గోటికి కూడా ప్రకాశ్ రాజ్ సరిపోడు, మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఖండించలేదే.. నట్టి కుమార్ వ్యాఖ్యలు

Natty Kumar: ప్రస్తుతం తిరుమల లడ్డు విషయంలో ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ విషయంలో పవన్ సైలెంట్ అయినా కూడా ప్రకాశ్ రాజ్ తన ట్వీట్లతో రెచ్చగొడుతున్నారని చాలామంది ప్రేక్షకులకు అనిపిస్తోంది. తాజాగా నిర్మాత నట్టి కుమార్ కూడా అదే ఫీలయ్యారు. పవన్ కళ్యాణ్‌తో ప్రకాశ్ రాజ్ చేస్తున్న ట్వీట్ యుద్ధం వెనుక స్వార్థపూరిత ఎత్తుగడ ఉండవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకకు చెందిన ప్రజ్వల్ రేవన్న అమానవీయ ఘటనలపై ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ స్పందించలేదని గుర్తుచేశారు. సినీ పరిశ్రమ కోసం, ప్రజల కోసం తను ఎప్పుడూ ఏం చేయలేదని అన్నారు. తాజాగా నట్టి కుమార్ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసి ప్రకాశ్ రాజ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.


రాజకీయ కుట్ర

‘‘రజినీకాంత్‌ను కొందరు కావాలని ట్రోల్ చేసినప్పుడు ప్రకాశ్ రాజ్ ఏమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను మాత్రం ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వెనుక ఏదో రాజకీయ కుట్ర ఉందని అర్థమవుతోంది. ఆయన దేవుడిని అవమానిస్తున్నాడు. సనాతన ధర్మం గురించి పవన్ మాట్లాడుతున్నారు. దాని వల్లే ఆయనంటే కొందరికి నచ్చడం లేదు. పవన్ కాలి గోటికి కూడా ప్రకాశ్ రాజ్ సరిపోడు. ఇదంతా ఆయన డైవర్షన్ కోసమే చేస్తున్నట్టుంది. జగన్.. చిరంజీవిని అవమానించినప్పుడు, అయిదు రూపాయల టికెట్ పెట్టినప్పుడు.. ఇండస్ట్రీలోని అమ్మాయిలను డ్రగ్స్ పేరుతో కేసీఆర్ నిలబెట్టినప్పుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ ఎందుకు చేయలేదు. రేణు దేశాయ్, భువనేశ్వరి గురించి అసభ్యకరంగా మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ గానీ, ప్రకాశ్ రాజ్ గానీ ఏమయ్యారు?’’ అని ప్రశ్నించారు నట్టి కుమార్.


Also Read: చీప్ రాజకీయాలు.. తిరుపతి లడ్డూ వివాదాన్ని వదలని ప్రకాష్ రాజ్

సురేఖ చేసింది కరెక్ట్

‘‘జగన్, కేసీఆర్ అంటే ప్రకాశ్ రాజ్‌కు భయమా? అందుకే ఖండించలేదా? చిరంజీవి తల్లి అంజనా దేవి గురించి పోసాని అసభ్యంగా మాట్లాడినప్పుడు ఖండన ఏది? అప్పుడు ఉన్నది మీ ప్రభుత్వాలే అనే ఖండించలేదా? టీడీపీ, పవన్ కళ్యాణ్ అధికారంలో ఉంటేనే ప్రకాశ్ రాజ్ ట్వీట్‌లు చేస్తారా? దీని బట్టి ఆయన స్వార్దపరుడని అర్ధమవుతుంది. ఆయన పొలిటికల్‌గా వచ్చి పవన్ కళ్యాణ్‌ను ఎదుర్కోవాలి’’ అంటూ సీరియస్ అయ్యారు నట్టి కుమార్. అంతే కాకుండా ఈ ప్రెస్ మీట్‌లో కొండా సురేఖ కాంట్రవర్సీపై కూడా ఆయన స్పందించారు. సమంతపై సురేఖ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు కాబట్టి ఆమె సారీ చెప్పారని గుర్తుచేసుకున్నారు. జానీ మాస్టర్ వివాదం గురించి కూడా ఆయన మాట్లాడారు.

కాకాపట్టేవారికే పదవులు

‘‘జానీ మాస్టర్ కేసులో అసలు విషయాలు త్వరలోనే బయటికొస్తాయి. అతడికి జరిగిన అన్యాయం గురిం చి డాన్సర్స్ యూనియన్ గట్టిగా మాట్లాడాలి. జానీతో పాటు బాధితురాలి కార్డ్ కూడా క్యాన్సెల్ చేయాలి. జానీ కుటుంబాన్ని రోడ్డున పడేయవద్దు. నేషనల్ అవార్డ్ క్యాన్సెల్ అవ్వగానే బెయిల్‌ను అతడే నిజాయితీగా క్యాన్సెల్ చేసుకున్నాడు. అతడి విషయంలో సత్యమే గెలుస్తుంది’’ అని జానీ మాస్టర్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు నట్టి కుమార్. ‘‘తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు అన్నీ సాక్ష్యాలతో ప్రెస్ మీట్ పెట్టారు. వైసీపీ హయాంలో అక్కడ భక్తులకు అన్యాయం జరిగింది అనేది వాస్తవం. అయినా వైసీపీపై చంద్రబాబు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? కాకాపట్టేవారికే పదవులు ఇస్తున్నారు’’ అంటూ చంద్రబాబు పాలనపై కూడా వ్యాఖ్యలు చేశారు నట్టి కుమార్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×