Texas floods: అమెరికాలోని టెక్సాస్ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్వాడాలుపే నది పరీవాహక ప్రాంతం గురించి చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు అందంగా కనిపించే ఆ ప్రాంతం.. ఇప్పుడు ఎటు చూసినా వరద బీభత్సం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 120 మందికి పైగా మరణించారు. ఈ సంఖ్య పెరిగే అవకాశముందని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది.
వందలాది ఇళ్లు ధ్వంసం కావడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరదల్లో తప్పిపోయిన తమ వారి కోసం గాలింపు కొనసాగుతోంది. టెక్సాస్‌లోని హంట్, కంఫర్ట్, కెర్విల్లే కౌంటీలలో భారీ వర్షాలు కొనసాగుతాయని స్థానిక వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది.
కొన్నాళ్లుగా అమెరికాను ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. వరదలు, తుఫానులు, వైల్డ్ ఫైర్ వంటివి వెంటాడుతున్నాయి. లాస్ ఏంజిల్స్‌లో రేగిన కార్చిచ్చులు చాలావరకు సర్వనాశనం చేసింది. ఇప్పుడు టెక్సాస్‌ను వరద కుదిపేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో చెట్లు, రాళ్ళు, శిథిలాలను తొలగించడానికి భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు.
వరదల్లో 160 మందికి పైగా గల్లంతైనట్లు స్థానిక అధికారుల అంచనా. దశాబ్దాలుగా టెక్సాస్ ప్రజలు చూసిన విపత్తుని ఇప్పుడు చూస్తున్నారు. గ్వాడాలుపే నది వెంబడి మృత దేహాల కోసం గాలింపు చేపడుతున్నాయి బృందాలు. ఈ లెక్కన అక్కడ పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ALSO READ: ఈ పని చేస్తే పాతిక కోట్ల రూపాయలు మీవే
గ్వాడాలుపే నది సౌత్ ఫోర్క్‌లోని క్రిస్టియన్ బాలికల వేసవి శిబిరంలో కనీసం 27 మంది మరణించినట్టు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ వెల్లడించింది. మరోవైపు న్యూ మెక్సికోలోని రుయిడోసో అనే చిన్న పట్టణం భారీ ఆకస్మిక వరదలతో అతలాకుతలమైంది. పరిస్థితి గమనించిన అధికారులు అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
వరద నీటి ప్రవాహానికి పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇల్లు కొట్టుకుపోతున్న వీడియోను ఓ వ్యక్తి షూట్ చేసి సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయ్యింది. అక్కడి వరద తీవ్రతను ఈ వీడియో కళ్లకు కట్టినట్టు చూపించింది. రియో రుయిడోసో నది వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. ఆ ప్రాంతంలోని అనేక వంతెనలు మునిగిపోయాయి.
వరదల్లో అనేకమంది ప్రజలు చిక్కుకుపోయారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మేయర్ లిన్ క్రాఫోర్డ్ పేర్కొన్నారు. రుయిడోసోలో నది 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ప్రవహిస్తోంది. పరిస్థితి గమనించిన అధికారులు ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచన చేశారు .
BREAKING 🚨 MASSIVE flooding is now currently unfolding in Ruidoso, New Mexico. It is sweeping structures away in seconds
Please pray for them 🙏
— MAGA Voice (@MAGAVoice) July 9, 2025