BigTV English

Nasa Challenge: ఈ పని చేస్తే పాతిక కోట్ల రూపాయలు మీవే, ప్రకటించిన నాసా.. మీరు సిద్ధమేనా

Nasa Challenge: ఈ పని చేస్తే పాతిక కోట్ల రూపాయలు మీవే, ప్రకటించిన నాసా.. మీరు సిద్ధమేనా

నాసా.. అమెరికన్ అంతరిక్ష సంస్థ. ఎప్పటినుంచో అంతరిక్ష ప్రయోగాలపైన ముందడుగు వేస్తోంది. అయితే ఇప్పుడు ఆ సంస్థ ప్రపంచం ముందు ఒక సవాలును విసిరింది. ఎవరైతే తాము చెప్పిన పనిని చేస్తారో వారికి పాతిక కోట్ల రూపాయల బహుమతిని ఇస్తామని కూడా ప్రకటించింది. ఇంతకీ నాసా చెప్పిన పని ఏంటో తెలుసా?


చేయాల్సిన పని ఇదే
1910 నుంచి అపోలో మిషన్లలో వ్యోమగాములు కొంత మంది చంద్రునిపైకి వెళ్లి వచ్చారు. వారు వదిలిపెట్టిన వ్యర్ధాలు 96 సంచులు దాకా వచ్చాయి. 50 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ సంచులు అలాగే ఉన్నాయి. ఆ వస్తువులను పారవేసేందుకు నాసా కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. దీని కోసమే ‘ఏజెన్సీ లూనా రీసైకిల్ ఛాలెంజ్’ను ప్రారంభించింది. ఆ 96 సంచుల్లో అంతరిక్షంలోని వ్యోమగాములు అప్పట్లో వదిలిన చెత్త నిండి ఉంది. అంటే వారి మలం, మూత్రం, వాంతులు, ఇతర వస్తువులు వంటివన్నీ ఉన్నాయి. వాటిని రీసైకిల్ చేసి వస్తువులుగా మార్చగల సాంకేతికతను సృష్టిస్తే.. తాము పాతిక కోట్ల రూపాయలను బహుమతిగా ఇస్తామని నాసా ప్రకటించింది.

రాళ్లు తెచ్చి చెత్త వదిలేశారు
అపోలో వ్యోమగాములు చంద్రునిపై ఆరుసార్లు విజయవంతంగా అడుగుపెట్టారు. ఈ మిషన్ సమయంలో వారు భూమి మీదకి తిరిగి వచ్చేటప్పుడు రాళ్ల నమూనాలను కూడా తీసుకొచ్చారు. అయితే వారు తిరిగి వచ్చేటప్పుడు తమ చెత్తను మోసుకొచ్చేందుకు స్థలం లేకపోవడంతో చంద్రుని ఉపరితలంపైనే ఆ చెత్తను వదిలి వచ్చేసారు. అలా ఇప్పటికీ చంద్రునిపై మానవ వ్యర్ధాలతో నిండిన సంచులు 96 దాకా ఉన్నాయి.


నాసా చంద్రునిపై శాశ్వతంగా మానవ ఉనికిని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో అక్కడ ఉన్న వ్యర్ధపదార్థాల నిర్వహణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. దీర్ఘ అంతరిక్ష కార్యకలాపాలకు ఈ వనరులను తిరిగి ఉపయోగించుకునేలా వాటిని సంరక్షించాలని భావిస్తోంది. అందుకే చంద్రని పై ఉన్న వ్యర్ధాలను తిరిగి భూమి మీదకు తీసుకురావడం సాధ్యం కాదు. కానీ చంద్రుని పైనే వాటిని తిరిగి ఉపయోగించడం ఎలాగో కనిపెట్టాలని భావిస్తోంది. అందుకే ప్రపంచంలోని తెలివైన వారికి ఆ సవాలును విసిరింది. ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు వంటి వారు ఈ బహిరంగ సవాలును స్వీకరించవచ్చు.

ఆ వ్యర్థాలను మీరు పోషకాలు, నేల, శక్తి, ఇతర వస్తువులు వంటి రూపాల్లోకి మార్చే అవకాశం ఉందేమో, ఎలా మార్చాలో కనిపెట్టడమే మీ పని. అలాగే వాటి వల్ల జీవసంబంధమైన ప్రమాదాలు కలగకుండా చూసుకోవాలి. ఆ వస్తువులను రీసైకిల్ చేసి తిరిగి కొత్త వస్తువులను సృష్టించే విధానాన్ని కూడా కనిపెట్టాలి. ఇలా ఆ మానవ వ్యర్ధాలను ఏ రూపంలోకి మార్చే ఆలోచనను అందించినా… నాసా అభినందించి మీకు నగదు బహుమతిని అందిస్తుంది.

మీ ఆలోచనలను నాసాకు తెలియజేయవచ్చు. న్యాయమూర్తుల ప్యానెల్ అందులోని ఉత్తమ ఆలోచనలను, సాంకేతికతను ఎంపిక చేసి బహుమతి ప్రధానం చేస్తుంది.

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×