BigTV English

Viral Video : భోజనం చేస్తుండగా పాము.. బెదిరిపోయిన కస్టమర్.. చివర్లో ట్విస్ట్

Viral Video : భోజనం చేస్తుండగా పాము.. బెదిరిపోయిన కస్టమర్.. చివర్లో ట్విస్ట్

Viral Video : అనగనగా ఓ హోటల్. కస్టమర్లతో ఫుల్ రద్దీగా ఉంది. టేబుల్స్ అన్నీ బిజీగా ఉన్నాయి. సర్వర్లు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ఓ కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా భోజనం చేస్తున్నారు. అప్పటి వరకూ అంతా మామూలుగానే ఉంది.. ఆ తర్వాతే ఓ కస్టమర్ ఉలిక్కిపడింది. భయంతో బెదిరిపోయింది. పాము పాము అంటూ పెద్దగా అరిచింది. ఆమె అలా అరుస్తుంటే పక్కనున్న మహిళ ఆ మహిళను చూసి నవ్వుతూ ఉంది. పాపం.. వయస్సులో పెద్దావిడే. 60 ఏళ్లకు పైగానే ఉండొచ్చు ఏజ్. డైనింగ్ టేబుల్‌పై పామును చూసి చాలా షాక్ అయింది. ఆ భయానికి ఏ గుండెపోటో వస్తే…? ఏంటి పరిస్థితి..? ఇంతకీ హోటల్‌లోకి పాము ఎలా వచ్చింది? టేబుల్ ఎలా ఎక్కింది? ఆ ముసలావిడ భయపడుతుంటే.. పక్కనున్న వారంతా ఎందుకలా నవ్వారు? వాళ్లెందుకు పామును చూసి భయపడలేదు..? ఇవన్నీ ఆ హోటల్‌లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్.


అసలేం జరిగిందంటే…

డైనింగ్ టేబుల్‌పై పాము ఉన్న మాట నిజమే. అది రియల్ పామే. అటూ ఇటూ తిరుగుతూ ఉంది. చాలా లావుగా, పొడుగ్గా, పెద్దగా ఉంది. చూస్తేనే పై ప్రాణాలు పైనే పోయేలా ఉంది. టేబుల్‌ చుట్టూ అందరూ కూర్చొని ఉండగా.. మెళ్లిగా సర్రును జారుకుంటూ వచ్చింది. టేబుల్ పై అటూ ఇటూ తిరిగింది. అదీ అక్కడ జరిగింది. ఆ సీన్ చూసి ఆ మహిళ హడలిపోయింది. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఏదో దేశంలో జరిగింది ఈ ఘటన. సోషల్ మీడియా ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లోనూ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మిగిలిన వాళ్లు ఎందుకు భయపడలేదు? ఆమెను చూసి ఎందుకు నవ్వారు?


ఆ హోటల్‌లో పాములే స్పెషల్

ఆ హోటల్‌ను స్నేక్ థీమ్‌తో నడిపిస్తున్నారు. పాములే అక్కడి అట్రాక్షన్. ఆ పాములను చూట్టానికే భోజన ప్రియులు ఆ హోటల్‌కు వస్తుంటారు. టేబుల్‌పై పాము అలా మెలికలు తిరుగుతుంటే.. దాన్ని చూస్తూ.. ఫుడ్‌ను లొట్టలేసుకుంటూ తింటుంటారు. మామూలు వాళ్లైతే భయానికి ఆ హోటల్‌కు వెళ్లకపోవచ్చు కానీ.. పాములను దగ్గరి నుంచి చూడాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లే ఆ ప్లేస్‌కు వెళుతుంటారు. అక్కడ ఉండేవన్నీ రియల్ పాములే కానీ.. చివర్లో చిన్న ట్విస్ట్.

పాములతో భోజనం..

ఆ పాము డైరెక్ట్‌గా డైనింగ్ టేబుల్‌పైన ఉండదు. చెక్క టేబుల్‌పై ఓ గ్లాస్ బాక్స్ ఏర్పాటు చేశారు. ఆ గ్లాస్ కింద స్నేక్ అటూ ఇటు తిరుగుతుంటుంది. గ్లాస్ టాప్ మీద కస్టమర్లు డిన్నర్ చేస్తుంటారు. అంటే తింటుండగా.. టేబుల్‌కు, ప్లేట్‌కు మధ్యలో గాజు షీట్ కింద పాము కదులుతుంటుందన్న మాట. అదేం బుసలు కొట్టదు.. కాటు వేయదు. అక్కడంతా సేఫ్. అందుకే ఆ మహిళ భయపడినా.. మిగిలిన వారంతా నవ్వుతూ ఉన్నారు. ఏం కాదని తెలిసే. ఇంకా క్లియర్‌ కట్ క్లారిటీ రావాలంటే ఆ వీడియో ఓసారి చూసేయండి…

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×