Big Tv Live Original: AI టెక్నాలజీ.. పెద్దగా పరిచయం అసవరం లేని పేరు. ఈ సరికొత్త టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలుతోంది. AI టెక్నాలజీతో కంటెంట్ క్రియేటర్లు కళ్లు చెదిరే అద్భుతాలు సృష్టిస్తున్నారు. AI టెక్నాలజీ సాయంతో రూపొందించే ఫోటోలు, వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. సందర్భం ఏదైనా AI ఫోటో అంటే అదిరిపోవాల్సిందే. తాజా కుంభమేళాను బేస్ చేసుకుని ‘Artificial Budhi’ అనే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఓ సూపర్ డూపర్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో దివంగత లెజెండ్స్ ఒకవేళ కుంభమేళాకు వచ్చి పుణ్యస్నానాలు చేస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్ తో ఈ వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
కలాం నుంచి టాటా వరకు..
ఇక ఈ AI టెక్నాలజీ వీడియోలో పలువురు ప్రముఖులను పరిచయం చేశారు. ముందుగా భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త, సామాజికసేవకుడు రతన్ టాటాను చూపించారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి నమస్కరిస్తున్నట్లు చూపించారు. ఆ తర్వాత జాతిపిత మహాత్మాగాంధీ మూడు నదులు కలిసిన చోట పుణ్యస్నానం చేస్తున్నట్లు క్రియేట్ చేశారు. ఆ తర్వాత దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించే శాస్త్రవేత్త అబ్దుల్ కలాం త్రివేణిసంగమంలో స్నానం చేస్తున్నట్లు చూపించారు. ఆ తర్వాత ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్, దివంగత గాయని లతా మంగేష్కర్, దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, ఉక్కుమనిషి, దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయి, దివంగత ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ నిజంగానే కుంభమేళాకు వచ్చి పుణ్యస్నానాలు చేసినట్లుగా చూపించారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతం అంటూ ప్రశంసిస్తున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
ఆకట్టుకుంటున్న విదేశీ నాయకుల కుంభ్ స్నానాలు
ఇక ఇప్పటికే ‘Artificial Budhi’ నిర్వాహకులు విదేశీ ప్రముఖులు కుంభమేళా స్నానం చేస్తే ఎలా ఉంటుంది? అనే వీడియోను కూడా రిలీజ్ చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్,మాజీ బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్స్ రొనాల్డో, మెస్సీ, టెన్నిస్ స్టార్స్ ఫెదరర్, జకోవిచ్, పలువురు హాలీవుడ్ ప్రముఖలు మహా కుంభమేళాలో స్నానం చేస్తున్నట్లు చూపించారు. ఈ వీడియోకు కూడా నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కాయి. మొత్తంగా ‘Artificial Budhi’ క్రియేటర్స్ రూపొందిస్తున్న వీడియోలో ఆహా అనిపిస్తున్నాయి. ఆయా సందర్భానికి అనుగుణంగా AI టెన్నాలజీతో అద్భుతమైన కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. అందరి చేతి శభాష్ అనిపించుకుంటున్నారు
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
Read Also: స్వచ్ఛమైన ‘ప్రేమ’ ఇక చరిత్రేనా.. నేటితరం ‘సింగిల్’గా మిగిలిపోవడానికి కారణాలు ఇవేనట!