Blockbuster Utsavam Promo : బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8) కంటెస్టెంట్స్ అందరూ మళ్లీ ఒకే తెరపై కలిసి, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతున్నారు. షోలో ఉన్నన్ని రోజులు తెగ కొట్టుకున్న కంటెస్టెంట్స్ తాజాగా ‘బ్లాక్ బస్టర్ ఉత్సవం’ (Blockbuster Utsavam) పేరుతో టీవీలో ప్రసారమవుతున్న ఓ షోలో కలిసికట్టుగా కనిపించబోతున్నారు. ఫిబ్రవరి 16న ఈ ‘బీబీ ఉత్సవం’ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం కాబోతున్న ఈ షో ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.
గెస్ట్ లుగా బిగ్ స్క్రీన్ స్టార్స్
తాజాగా రిలీజ్ చేసిన ‘బీబీ ఉత్సవం’ ప్రోమోలో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సందీప్ కిషన్, సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి సందడి చేశారు. ఒక్కొక్కరూ తమ ఆటపాటలతో మాత్రమే కాదు సెటైర్లు వేసి అదరగొట్టారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి పంచ్ లు వేస్తూ, ప్రోమోలో వీళ్ళు చేసిన సందడి ఆకట్టుకుంటుంది.
పృథ్వీని వదలని విష్ణు ప్రియ
‘బీబీ ఉత్సవం’ ప్రోమోలో ఎప్పటిలాగే ముక్కు అవినాష్ హైలెట్ గా నిలిచాడు. ఇందులో రన్నర్ అని యాంకర్ శ్రీముఖి పిలవగానే, ముక్కు అవినాష్ మైక్ అందుకున్నాడు. కానీ “రన్నర్ అన్నాను” అనగానే, ఆయన మైక్ గౌతమ్ కి ఇచ్చేశాడు. దీంతో స్టేజ్ పై నవ్వులు పూసాయి. అలాగే షో మొత్తంలో విష్ణు ప్రియ, నిఖిల్, పృథ్వీ, యష్మిలను హైలెట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు విష్ణు ప్రియ (Vishnu Priya) – పృథ్వీ (Prithvi)ల యవ్వారం హాట్ టాపిక్ అయ్యింది. అలాగే ఈ షోలో కూడా విష్ణు ప్రియ పృథ్వీని వదల్లేదు.
ముఖ్యంగా అనిల్ రావిపూడి మణికంఠను “మణి నువ్వు ఎవరి ఫ్యాన్?” అని అడిగాడు. వెంటనే మణికంఠ “నేను నాకు మాత్రమే ఫ్యాన సర్” అని సమాధానం చెప్పాడు. దీంతో అనిల్ రావిపూడి “ఇలాంటివే తగ్గించుకుంటే మంచిది… అని మీమ్ వేశారు. అప్పుడు నేను అనలేకపోయాను” అంటూ పంచ్ వేశారు.
విశ్వక్ సేన్ తో ‘దబిడిదిబిడి’ స్టెప్పులు
విశ్వక్ సేన్ ఎంట్రీ ఇవ్వగానే “లైలా మేరీ జాన్” అంటూ ముక్కు అవినాష్ అదోలా చూడడం స్టార్ట్ చేశాడు. వెంటనే అవినాష్ “నేనిప్పుడు అబ్బాయిని, అమ్మాయిని కాదు… అలా చూడకపోతేనే బాగుంటుంది” అంటూ పంచ్ వేసాడు. ఆ తర్వాత రోహిణి, విశ్వక్ సేన్ ఇద్దరూ కలిసి వైరల్ “దబిడి దిబిడి” స్టెప్ వేశారు.
తగ్గేదేలే అంటున్న గంగవ్వ
ఇక షోలో భాగంగా కంటెస్టెంట్స్ ని మామూలుగా రోస్ట్ చేయలేదు. కుక్కర్ క్విన్ అంటూ బేబక్కకు, బీబీ వాకిట్లో సోనియా, ఏబిసి అంటూ యష్మి, గౌతమ్, నిఖిల్ లను అవార్డు ఇచ్చి ఆటపట్టించారు. చివరగా “దమ్ముంటే గెలకర అమ్మాయిల్ని… గెలికిన ప్రతి అమ్మాయిని చేస్తాను నీకు చెల్లెల్ని” అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరి చేత రాఖీ కట్టించింది శ్రీముఖి. చివరగా గంగవ్వ దావత్ అంటూ కంటెస్టెంట్స్ అందరికీ మంచి విందు భోజనం పెట్టింది. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 16న ప్రసారం అవుతుంది.