Quick Eating: సరైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం అని మనందిరికీ తెలుసు. కానీ నేటి బిజీ లైఫ్‌లో త్వరగా ఆహారం తినే అలవాటు చాలా మందిలో పెరిగిపోయింది. ఇది మన శరీరంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. మనం తినేటప్పుడు ఆహారం అన్నవాహికలోకి ప్రవేశిస్తుంది. దాని పక్కన ‘ఫారింక్స్’ అనే శ్వాస గొట్టం ఉంటుంది. మనం తినేటప్పుడు ఈ వాయునాళం మూసుకుపోతుంది. కాబట్టి ఏ ఆహార పదార్థం దానిలోకి వెళ్లదు. కానీ మనం త్వర త్వరగా ఆహారం తింటే మాత్రం ఆహారంలోని కొంత భాగం వాయునాళంలోకి వెళుతుంది. అది మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంతే కాకుండా కొన్ని సార్లు కూడా దగ్గు వస్తుంది. తొందరగా నీరు త్రాగినప్పుడు కూడా అది ముక్కులోకి చేరడం కూడా గమనిస్తుంటాం.
త్వరగా ఆహారం తినడం వల్ల కలిగే ప్రమాదాలు:
ఆహారం తినేటప్పుడు అందులోని కొంత ముక్క పెద్దగా ఉంటే లేదా వాయునాళంలో ఇరుక్కుపోతే, అది బయటకు రాదు. అటువంటి సందర్భంలో వాయునాళంలో అడ్డంకులు ఏర్పడటం వల్ల న్యుమోనియా రావచ్చు . కొన్నిసార్లు ఈ పరిస్థితి చాలా తీవ్రంగా మారి ఆ వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఈ పరిస్థితి మరింత తీవ్రమైన సందర్భాల్లో శ్వాసకోశ సమస్య కారణంగా మరణానికి కూడా దారితీస్తుంది. ఈ పరిస్థితి మీ ఆరోగ్యానికి ప్రమాదకరమే కాకుండా మీ జీవితాన్ని కూడా ప్రమాదంలో పడేస్తుంది.
జాగ్రత్తగా ఉండాలి:
కాబట్టి ఆహారం తీనేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. మీ ఆహారాన్ని బాగా నమిలి చిన్న చిన్నగా నమిలి తినండి. తొందరగా తినడం మానుకోండి. ఎందుకంటే ఇది జీర్ణ సంబంధిత సమస్యలను కలిగించడమే కాకుండా మీ శ్వాసకోశ వ్యవస్థకు కూడా హాని కలిగిస్తుంది. కాస్త నెమ్మదిగా తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కావడమే కాకుండా, మీ మొత్తం శరీరానికి కూడా మేలు జరుగుతుంది.
మన శరీరానికి ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి సమయం కావాలి. కాబట్టి సరైన ఆహారపు విధానాన్ని అలవర్చుకుని ఆరోగ్యకరమైన జీవితం వైపు మరో అడుగు వేయండి.
Also Read: నెయ్యి తింటే.. బరువు పెరుగుతారా ?
తినడానికి మొదటి, అతి ముఖ్యమైన మార్గం ఏమిటంటే మనం ఆహారాన్ని నెమ్మదిగా , హాయిగా నమిలి తినాలి. ఆహారాన్ని నమలడం ద్వారా,ఆహారంలోని పోషకాలు మన లాలాజలంలో కలిసిపోతాయి. దీనివల్ల ఆహారం కడుపులోకి చేరి సులభంగా, బాగా జీర్ణం అవుతుంది.
ఎల్లప్పుడూ కూర్చొని ఉన్నప్పుడు ఆహారం తినండి. నిలబడి తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. నేలపై కాళ్ళు చాపి కూర్చొని తినడం చాలా ప్రభావ వంతంగా ఉంటుందట. ఏది ఏమైనా నెమ్మదిగా తినడం ఇక నుండి తప్పకుండా అలవాటు చేసుకోండి.
ఆహారం తినండి.. కానీ తొందరపడకండి. చిన్న చిన్న ముక్కలుగా నమిలి తినండి. ఎలాంటి ఆహారం తిన్నా కూడా బాగా నమలండి. ఈ అలవాటుతో మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడమే కాకుండా మీ ప్రాణాలకు ప్రమాదం నుండి కాపాడుకోండి.