Alekhya Sister’s:అలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్స్ సోషల్ మీడియాలో హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకొని..అటు పికెల్స్ బిజినెస్ తో సక్సెస్ఫుల్గా దూసుకుపోయారు. అయితే బిజినెస్ మొదలుపెట్టిన 11 నెలల్లోనే అనూహ్యంగా బిజినెస్ క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. కారణం అలేఖ్య చిట్టి పెట్టిన ఒకే ఒక్క అభ్యంతరకర ఆడియో మెసేజ్..దెబ్బకు పికెల్స్ బిజినెస్ పూర్తిగా మూత పడింది. అంతేకాదు ఆమె పెట్టిన అసభ్యకరమైన మాటలకి చాలామంది చిట్టిపై ఫైర్ అవ్వడంతో పాటు సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ చేశారు. అటు జనాల మాటలకి డిప్రెషన్ లోకి వెళ్లిన చిట్టిని.. హాస్పిటల్ లో ఐసీయూలో కూడా చేర్పించారు కుటుంబ సభ్యులు. ఆ సమయంలో చిట్టి సోదరీమణులు ఇద్దరూ కూడా ప్రాణం తీసేస్తారా..? ఎందుకు అంతలా నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు? మా సిస్టర్ చేసింది తప్పే.. కానీ మీ మాటలతో ఒక అమ్మాయిని ఇంత దారుణంగా హింసించడం కరెక్ట్ కాదు అంటూ మాట్లాడారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఈ సిస్టర్స్ సైలెంట్ అయిపోయారు. దీంతో పలు రకాల కామెంట్లు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అందరినోళ్లు మోయంచేలా ఒక్క వీడియోతో అన్నింటికీ సమాధానం చెప్పేది చిట్టి అలియాస్ అలేఖ్య.
తొలిసారి ఆడియన్స్ ముందుకొచ్చిన అలేఖ్య..
ఇదిలా ఉండగా చిట్టి సిస్టర్ సుమ ఓ వెకేషన్ కి వెళ్ళగా.. ఆ సమయంలో చాలామంది ఫాలోవర్స్ అలేఖ్య ఆరోగ్యం ఎలా ఉంది..? మళ్లీ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటూ ఎన్నో ప్రశ్నలు అడిగారు. అయితే ఆ ప్రశ్నలన్ని స్క్రీన్ షాట్స్ తీసుకున్న సుమ.. నాకంటే చిట్టి ఆన్సర్ ఇస్తేనే బాగుంటుందని లైవ్ లోకి అలేఖ్యని తీసుకువచ్చి ఆన్సర్లను తనతోనే చెప్పించింది.ఇందులో భాగంగా చాలామంది నెటిజన్స్ అలేఖ్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందని అడిగారు. దానికి అలేఖ్య ఇప్పుడు చాలా బాగున్నాను అని చెప్పింది. అలాగే మళ్లీ పికెల్స్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడగగా.. ఇప్పుడప్పుడే మళ్ళీ పికెల్స్ బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచన లేదు. హెల్త్ కుదురుకోవడానికి కాస్త టైం పడుతుంది అని ఆన్సర్ ఇచ్చింది. అలాగే ఫ్యూచర్లో వేరే బిజినెస్ చేసే ఉద్దేశం లేదని, ఒకవేళ చేస్తే అన్ని సర్దుకున్నాక ఆరోగ్యం సెట్ అయ్యాక మళ్ళీ పికెల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పింది.అలాగే జరిగిన ఈ గొడవలో తప్పు ఎవరిదని కొంతమంది ప్రశ్నలు అడగగా..ఇందులో తప్పు పూర్తిగా నాదే.. కొన్ని కొన్ని సార్లు ఏం మాట్లాడతామో మనకే తెలియదు. అలా నేను కూడా మాట్లాడాను. తప్పు నాదే అని చెప్పింది.
అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం..
ఫ్యూచర్లో కచ్చితంగా మళ్ళీ పికెల్స్ బిజినెస్ లో రీఎంట్రీ ఇస్తానని ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కాస్త కుదుటపడుతోందని కానీ ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసే అంత ఓపిక తనకి లేదని, ప్రస్తుతం తన మైండ్ అంత కరెక్ట్ గా లేదని అలేఖ్య చెప్పుకొచ్చింది. అలాగే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని కొంతమంది ప్రశ్నలు అడగగా.. ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కూడా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ కచ్చితంగా ఫ్యూచర్లో మళ్లీ పికెల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తానని అలేఖ్య చెప్పడంతో ఆమె అభిమానులు సంతోష పడుతున్నారు. ఇక అలేఖ్య సిస్టర్ రమ్య రీసెంట్ గానే ఓంకార్ తమ్ముడు అశ్విన్ సినిమాతో నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది.
మళ్లీ అవే సీరియస్ మాటలు..
ఇకపోతే అప్పటివరకు అన్ని ప్రశ్నలకు కూల్ గా సమాధానం చెప్పిన అలేఖ్య.. ఒక నెటిజన్ రేటెంత అని అడిగేసరికి మళ్ళీ కాస్త సీరియస్ అయింది. ఇక ఇలా ఈమె సీరియస్ అవడంతో ఈమెను ఎవరు కాపాడలేడు. మళ్లీ అవే పాత పచ్చడి మాటలు అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరి ఇంత జరిగినా ఇంకా సైలెంట్ కాకపోతే ఇక మీకు నష్టం తప్పదని మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.
అలేఖ్య బూతులు ఎక్కడ నేర్చుకుంది..
ఇకపోతే సుమ ర్యాండంగా ఎంపిక చేసిన ప్రశ్నలలో “అలేఖ్య బూతులు ఎక్కడ నేర్చుకుంది?” అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించారు.. దానికి అలేఖ్య మాట్లాడుతూ..” చెబితే తిడతారేమో నేను కూడా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చూసే ఈ బూతు కామెంట్స్ నేర్చుకున్నాను” అంటూ హాట్ బాంబ్ పేల్చింది.