BigTV English

Single Movie : ఓటీటీలోకి వచ్చేసిన విష్ణు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Single Movie : ఓటీటీలోకి వచ్చేసిన విష్ణు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Single Movie : బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాల హవా ఎక్కువగానే ఉంది. ఈ సినిమాలకే ఎక్కువగా జనాలు నిరాజనం పలుకుతున్నారు. ఈ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన మొదటి రోజే మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి చిత్రాలలో ఈమధ్య వచ్చిన సింగిల్ మూవీ కూడా ఒకటి. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ చిత్రం సింగిల్.. గీతా ఆర్ట్స్ సంస్థ పై శ్రీ విష్ణు హీరో గా నటించిన ఈ సినిమా లో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్ గా నటించారు. కేవలం 7 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత ఏకంగా 17 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూడాలని ఆశ పడుతున్నారు.. ఈ మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ వస్తుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


సింగిల్ మూవీ ఓటీటీ..

సామాజికవరగమన సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీ విష్ణు ఆ తర్వాత ఒక్కో మూవీతో తన టాలెంట్ నిరూపించుకుంటూ హీరోగా పరిచయమేనా అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.. ఈ హీరో నటించిన సినిమాలన్నీ కూడా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. రీసెంట్ గా సింగిల్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శ్రీ విష్ణు.. ఈ మూవీ పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా అత్యధిక వసూళ్లను రాబట్టింది..  ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. థియేట్రికల్ రన్ పూర్తి అయినా నాలుగు వారాల తర్వాత ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని మేకర్స్ తో ఒప్పందం కుదిరించుకున్నారు. దీంతో ఈ చిత్రాన్ని జూన్ 6 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ముందుగా అనుకున్న దాని కంటే ముందే ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుంది..


Also Read :‘ భైరవం ‘ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

ఓం భీమ్ బుష్ తో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో గత ఏడాది స్వాగ్ మూవీతో నిరాశ పరిచాడు. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తనదైన శైలిలో డిఫరెంట్ స్టోరీలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సింగిల్ మూవీ కూడా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పించింది. బ్యాంకులో మంచి ఉద్యోగం, జీతం ఉన్నా ఎందుకో సింగిల్ గానే ఉండిపోయాడు విజయ్. కార్ల షోరూం లో సేల్స్ గర్ల్ గా వర్క్ చేసే పూర్వ ను ప్రేమిస్తాడు. కానీ.. విజయ్ ను హరిణి ప్రేమిస్తుంది.. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎవరి ప్రేమ గెలిచింది? ఈ ప్రేమకథలో తలెత్తిన ఇబ్బందులు ఏమిటి? చివరికి విజయ్ సింగిల్ గా మిగిలిపోయాడా? లేదా అన్నది ఈ మూవీ స్టోరీ.. థియేటర్లలో అయితే సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.. ఇక ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×